Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    టీడీపీ గూటికి వంగవీటి రాధాకృష్ణ.. ఖారారైన ముహూర్తం

    ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వైపు.. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపు.. నేతల కప్పదాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీలో మరో వికెట్ పడింది.

    news18-telugu
    Updated: January 21, 2019, 4:10 PM IST
    టీడీపీ గూటికి వంగవీటి రాధాకృష్ణ.. ఖారారైన ముహూర్తం
    చంద్రబాబు, వంగవీటి రాధాక్రిష్ణ
    • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికల ముంగిట ప్రతిపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడలో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించిన ఆయన.. అధినేత జగన్‌ నుంచి హామీ లభించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అయితే, వంగవీటి రాధా అడుగులు ఎటువైపు అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.

    ఈనెల 28న చంద్రబాబు సమక్షంలో వంగవీటి.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయవాడ టీడీపీ నేతలు సైతం.. వంగవీటి రాధా రాకను స్వాగతిస్తున్నారు. అయితే, వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించి భంగపడిన రాధా.. టీడీపీలోనూ అదే సీటును కోరే అవకాశం ఉంది. ఆ దిశగానే ఆయన పావులు కదుపుతున్నారు. అనుచరులతో, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ.. వంగవీటి రాకతో అలర్టయ్యారు. తన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి కనిపిస్తుండడంతో.. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ap politics, ap political updates, ysrcp tdp, ysrcp leader vangaveeti radhakrishna, vangaveeti to tdp, Vijayawada central mla bonda uma, ap cm chandrababu naidu, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ రాజకీయాలు, ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్, వైఎస్ఆర్‌సీపీ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ లీడర్ వంగవీటి రాధాకృష్ణ, టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండ ఉమ
    బోండా ఉమ, వంగవీటి రాధాక్రిష్ణ ఫైల్


    టీడీపీ తరఫున సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమ విషయంలో టీడీపీ అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో రాధా రాకతో నగరంలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. గతంలో మంత్రి పదవి రాలేదని ఏకంగా అధిష్టానంపైనే విమర్శలకు దిగిన బోండా ఉమ వ్యవహారంపై అధినేత చంద్రబాబు సైతం ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ సీటు సునాయాసంగా దక్కించుకోవచ్చని వంగవీటి రాధా ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ బోండా ఉమను కాదని టీడీపీ అధిష్టానం వంగవీటికి టికెట్ ఇవ్వడం అంత సులువు కాదు... ఇచ్చినా గెలుపు అంత సునాయసం కాబోదు. దీంతో చివరి నిమిషం వరకూ సెంట్రల్ సీటుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది.

     

    ఇది కూడా చూడండి:

    First published: January 21, 2019, 4:10 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading