Andhra Pradesh: అప్పులే కాని.. ఆలోచనలు కనిపించడం లేదా..? విపక్షాలపై సజ్జల కౌంటర్లు

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

గత కొద్ది రోజులుగా వైసీపీ వెర్షన్ మారింది. గతంలో అప్పులు గురించి మాట్లాడడానికి ఇష్టపడని వైసీపీ నేతలు.. ఇప్పుడు అవును అప్పులు చేశామని ఒప్పుకుంటున్నారు.. తిరిగి అప్పులు చేస్తే తప్పేంటి అని నిలదీస్తున్నారు.. మరి వారు చెబుతున్న విరవరణ ఏంటో తెలుసా..?

  • Share this:
    Sajjala Ramakrishna Reddy: జాబ్ కేలండర్ పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏపీ ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు నమ్మో పరిస్థితి లేదన్నారు. లక్షలాది వైసీపీ కార్యకర్తలే ప్రజలకు వాస్తవాలు తెలియచేస్తారని అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లాలని కేడర్ కు సూచించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పదేళ్లపాటు వైయస్‌ జగన్‌ పక్కన నడిచిన అభిమానులే..నేడు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలయ్యారని గుర్తు చేశారు. ప్రజల అభిమానాన్ని జగన్‌ నిలుపుకోగలిగారన్నారు. అట్టడుగు వర్గాలను వాళ్ల కాళ్లపై నిలబెట్టడం.. ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే జగన్‌ లక్ష్యమని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చర్చావేదికలు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు.

    పార్టీ శ్రేణులకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన విధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విజయోత్సవ సభలో వెల్లడించారు. తొలి దశలో 15 వేల స్కూళ్లలో నాడు–నేడు పథకం ద్వారా పనులు చేపడుతున్నారని, కొత్త అభివృద్ధి కావాలంటే దీనిపై నిరంతరం చర్చ జరగాలని ఆయన తెలిపారు. ప్రత్యార్థులు ఈ పథకాలపై ఆలోచన చేయడం లేదని.. కేవలం అప్పులు చేస్తున్నారు..అధికార దుర్వినియోగం అంటూ విమర్శలు చేయం సరి కాదన్నారు. ప్రభుత్వం ఎందుకు అప్పుపలు చేయాల్సి వస్తోంది అన్నది ఆలోచించాలి అన్నారు.

    ఏపీ వ్యాప్తంగా “లక్ష 34 వేల ఉద్యోగాలు ఇచ్చారని వారే చెబుతారు. మళ్లీ వాళ్లే ఉద్యోగాలే ఇవ్వడం లేదంటారు. రెగ్యులర్‌ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ మొన్న విడుదల చేయాల్సిన అవసరం లేదు. కానీ పోటీ పరీక్షలకు ప్రిఫైర్‌ అవుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని క్యాలెండర్‌ విడుదల చేశాం. ఈ ఏడాది రాలేదన్న నిరాశ ఉన్నా.. వచ్చే ఏడాది సాధిస్తామన్న ఆలోచన వస్తుంది.” అని సజ్జల తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు 34 వేల ఉద్యోగాలు ఇస్తే.. ఏడాదిలోనే 1.34 లక్షల ఉద్యోగాలు, ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగాలు సీఎం జగన్‌ ఇచ్చారని సజ్జల విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు..
    Published by:Nagesh Paina
    First published: