Petrol Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గించకపోవడంపై రాజకీయం రచ్చ రచ్చగా మారింది. ప్రభుత్వంపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎక్సైజ్ పన్ను తగ్గించిన తరువాత పలు రాష్ట్రాలు.. పెట్రోల్ ధరలు తగ్గించాయి.. కానీ ఏపీ ప్రభుత్వ (Andhra Pradesh Government) మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించేది లేదని స్పష్టం చేసింది. స్వయనా ఆర్థిక మంత్రి బుగ్గన (minster buggana) దీనిపై క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదని బుగ్గన స్పష్టం చేశారు. తాజాగా పెట్రోల్ రేట్ల తగ్గింపుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే ఏపీలో పెట్రోల్ అందిచేవాళ్లమని సజ్జల అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ తగ్గించాలని ధర్నాలు ఏంటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా చెప్పాలన్నారు. తగ్గించింది తక్కువ.. రాష్ట్రాల నుండి వసూలు చేస్తున్నది ఎక్కువ అని అన్నారు. వసూలు చేసే మొత్తం ఎక్సైజ్ డ్యూటీ కిందికి తీసుకురావాలని.. అప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగడంలేదు.. అంతా సవ్యంగా జరుగుతుందన్నారు. చంద్రబాబు చేతకాని తనంతో దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.. తన అభ్యర్థులతో సంతకాలు చేయించడం సాధ్యమా..? అని ప్రశ్నించారు. గెలవలేననే భయంతో ఉన్నవారు ఇలాంటి సాకులు చెప్తారని అన్నారు. అనంతపురం విద్యార్థులపై లాఠీ ఛార్జ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ ఒక్క కార్పొరేషన్ పరిస్థితి ఏంటి..? ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
దెబ్బ తగిలిన అమ్మాయి జనం నుండి వచ్చిందని చూసినవాళ్ళు చెబుతున్నారు.. ఆ అమ్మాయితో లోకేష్ ఫోన్ లో మాట్లాడించారని పేర్కొన్నారు. అక్కడ ఘటనలో బయటి నుండి వచ్చిన శక్తులు ఉన్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఎక్కడా బలవంతం చెయ్యడం లేదన్నారు. 2 వేల స్కూల్స్ కి.. 702 కు ఉన్న విధంగానే కొనసాగుతున్నాయని చెప్పారు. 1446 స్కూల్స్ టీచర్లను ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. 101 మొత్తం ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు.
ఇదీ చదవండి: మూడు అంశాల పై క్లారిటీ.. అపరిష్కృత సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ రెండేళ్లలో ప్రభుత్వ స్కూల్స్ గణనీయంగా బలోపేతం అయ్యాయని స్పష్టం చేశారు. ఏపీ -ఒడిషా సీఎంల సమావేశం తరువాత రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలు తమకే వస్తాయని.. సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. మొత్తం సభలో సామాజిక న్యాయం ఉండే విధంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Central governmennt, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy, Ysrcp