Andhra Pradesh: మీ రాజీనామాలకు మా అనుమతి ఎందుకు.. టీడీపీకి సజ్జల స్ట్రాంగ్ కౌంటర్

చంద్రబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

ఏపీలో రాజీనామాల అంశం రాజకీయంగా రచ్చ అవుతోంది. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయడానికి తాము సిద్ధం.. వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరితే.. వైసీపీ సెటైర్లు వేస్తోంది. మీ రాజీనామాలకు మా అనుమతి ఎందుకని ప్రశ్నిస్తోంది.

  • Share this:
    YCP vs TDP: ఏపీలో ప్రస్తుతం రాజీనామాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉక్కు కార్మికులకు చంద్రబాబు లేఖ రాయడం.. అందులో రాజీనామాలకు మేం సిద్ధమంటూ ఆయన రాశారు. అక్కడితోనే ఆగకుండా వైసీపీ ఎంపీలు కూడా రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉక్కు ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజీనామాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. వైసీపీకి సవాల్ విసిరారు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడం.. ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యంగా టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని.. మరి వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నిజంగా రాష్ట్ర సమస్యలపై చిత్త శుద్ధి ఉంటే రాజీనామాలు చేసి నిరూపించుకోవాలని.. టీడీపీ చిత్త శుద్ధి ఉంది కాబట్టే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఛాలెంజ్ విసిరారు.. విశాఖ ఉక్కు ఉద్యమ ప్రారంభం నుంచి టీడీపీ ఇదే డిమాండ్ వినిపిస్తూ వస్తోంది..

    టీడీపీ ఎంపీ సవాల్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు.. మీరు చేసినా చేయకపోయినా.. ప్రజలు ఇప్పటికే టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీశారు. ఇక, టీడీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారులు, కన్సలటెంట్ల ఎంత మంది ఉండేవారో లెక్కలు తీస్తున్నాం.. ఆ రోజు పరకాల, కుటుంబ రావు లాంటి వారు రాజకీయాలు మాట్లాడినప్పుడు తప్పుగా ఎందుకు కనిపించ లేదని ఆయన మండిపడ్డారు.

    ఇదీ చదవండి: మేం రాజీనామాలు చేస్తున్నాం.. వైసీపీ ఎంపీలకు రామ్మోహన్ నాయుడు సవాల్..

    మరోవైపు అమరావతి భూముల వ్యవహారం పెద్ద స్కామ్‌ అని మండిపడ్డారు. ఆ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలిసిన విషయాలేనన్న ఆయన.. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ లేదని సాంకేతిక అంశాలతోనే కోర్టులో తీర్పు వచ్చిందని.. ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించటం సాంకేతికంగా ఇబ్బంది అయితే.. మరో కోణంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.. తప్పు చేసిన వాళ్ళు కచ్చితంగా బయటపడతారని.. తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ కౌంటర్లకు టీడీపీ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి..

    ఇదీ చదవండి: భారీ వానలు.. వరదలతో గోదావరి ఉగ్రరూపం.. నీట మునిగిన పోచమ్మ ఆలయం
    Published by:Nagesh Paina
    First published: