కేశినేని నాని ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్... ఆడేసుకున్న వైసీపీ

ముందు ఆయన ఇంటర్ లేదా డిగ్రీలో చేరాలంటూ వైసీపీ నేత పీవీవీ ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: September 11, 2019, 1:27 PM IST
కేశినేని నాని ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్... ఆడేసుకున్న వైసీపీ
కేశినేని నాని,పీవీపీ(File Photos)
  • Share this:
ఛలో ఆత్మకూరులో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పలు ట్వీట్లు చేశారు. అయితే ఆయన చేసిన ఒక ట్వీట్లు అచ్చు తప్పులు దొర్లాయి. అంతే ఇదే అదనుగా వైసీపీ నేతలు సెటైర్లు అందుకున్నారు. ముందు ఆయన ఇంటర్ లేదా డిగ్రీలో చేరాలంటూ వైసీపీ నేత పీవీవీ ఎద్దేవా చేశారు. ‘ఏమయ్యా ఎంపీ... నీ చేతలతో ఎలాగూ నరకం చూపిస్తున్నావు. తమరి భాషా పరిజ్ఞానానికి చస్తున్నాము బాబు. It is called BIASED. Not baised. నువ్వేదో ఒక భగత్ సింగ్‌లా బిల్డప్ వద్దు. రోడ్డులెక్కి, IPS ఆఫీసర్స్ మీద రౌడీయిజం చేసినపుడు నీకు డెమెక్రసీ, రాజ్యాంగం లాంటివి గుర్తుకు రాలేదా. ప్రజా సంక్షేమం కోరి, మీ తరపున, అమ్మఒడిలో ఫీజు రీయింబర్సుమెంట్ చేయిస్తాను. కాస్త ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ పరీక్ష కడితే.’ అంటూ కేశినేని నాని ట్వీట్‌పై అచ్చు తప్పుల్ని ఎండగడుతూ పీవీపీ ట్వీట్ చేశారు.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు