ఏపీ రీపోలింగ్ ఎఫెక్ట్... వైసీపీ నేత షిర్డీ యాత్రలో ఏరులై పారిన మద్యం

చెవిరెడ్డి ఆ రైలులో సకల సౌకర్యాలు వారికి అందుబాటులో ఉంచారు. భోజనం, నీరు, ఇతర సదుపాయాలన్నీ రైలులోనే అందేలా చర్య తీసుకున్నారు.

news18-telugu
Updated: May 18, 2019, 1:33 PM IST
ఏపీ రీపోలింగ్ ఎఫెక్ట్... వైసీపీ నేత షిర్డీ యాత్రలో ఏరులై పారిన మద్యం
వైసీపీ నేత ఏర్పాటు చేసిన షిర్డీ యాత్రలో మద్యం
news18-telugu
Updated: May 18, 2019, 1:33 PM IST
రీ పోలింగ్ ఎఫెక్ట్ తో చంద్రగిరిలో మద్యం ఏరులై పారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలు,నేతల కోసం షిర్డీ యాత్ర ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. రీపోలింగ్‌ జరిగే ఐదు బూత్‌లలో నాయకులు, కార్యకర్తలకు షిర్దీ యాత్ర ఏర్పాటు చేశారు. దీనికోసం ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. కానీ, ఈ రైలులో ఆయన అనుచరులు చేసిన హంగామా, విచ్చలవిడిగా మద్యం సేవించి, పేకాట ఆడుతూ చేసిన గందరగోళం చుట్టుపక్కల వారిని ఆందోళనకు గురిచేసింది. చెవిరెడ్డి ఆ రైలులో సకల సౌకర్యాలు వారికి అందుబాటులో ఉంచారు. భోజనం, నీరు, ఇతర సదుపాయాలన్నీ రైలులోనే అందేలా చర్య తీసుకున్నారు. షిర్డీలో దిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు సందర్శించేందుకు కూడా ప్రత్యేకంగా వాహన ఏర్పాట్లు చేశారు. 23 బోగీలతో ఉన్న ఈ ప్రత్యేక రైలు తిరుపతి, రేణిగుంట మీదుగా షిర్డీకి బయలుదేరింది.

రైలులో పేకాట ఆడుతున్న వైసీపీ కార్యకర్తలు


అయితే రైలు బయలు దేరే ముందే.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పరుగున స్టేషన్‌ బయటకు వెళ్లి మద్యం కొని తెచ్చుకున్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో కార్యకర్తలు స్టేషన్‌ బయటకు, లోనికి పరుగులు పెట్టడంతో చుట్టుపక్కల వారు ఆందోళన చెందారు. కొందరు రైలులో, మరికొందరు ప్లాట్‌ఫాంపైనే విచ్చలవిడిగా తాగడంతో ఇతర ప్రయాణికులు నివ్వెరపోయారు. జీఆర్పీ పోలీసులు సైతం వారిని కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. పేకాట కూడా జోరుగా సాగింది.

దీనితో ఈ షిర్దీ యాత్ర కాస్తా... మద్యం, పేకాటల యాత్రగా మారింది అని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌తో పాటు రీపోలింగ్ సందర్భంగా కూడా నాయకులు జనానికి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంట్లో భాగంగానే వైసీపీ నేతలు షిర్డీ యాత్రకు వెళ్లే కార్యకర్తలకు మద్యాన్ని సరఫరా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...