అటు జగన్... ఇటు మెగా ఫ్యామిలీ... మధ్యలో పృథ్వీ

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మిగతా స్టార్స్ చిరంజీవిని పొగడటంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా... పృథ్వీ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

news18-telugu
Updated: September 23, 2019, 3:00 PM IST
అటు జగన్... ఇటు మెగా ఫ్యామిలీ... మధ్యలో పృథ్వీ
30 ఇయర్స్ పృథ్వీ (ఫైల్ ఫోటో)
  • Share this:
కొంతకాలం క్రితం వరకు సీఎం జగన్‌ను అభినందించేందుకు సినీ పెద్దలెవరూ ముందుకు రావడం లేదని... అసలు టాలీవుడ్ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టంలేదని సరికొత్త సంచలనానికి తెరలేపారు నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ. ఒక్కసారిగా కాదు... రెండు మూడు సార్లు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ కామెంట్స్‌కు టాలీవుడ్‌లోని రాజేంద్రప్రసాద్‌తో పాటు వైసీపీ నేతగా ఉన్న నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యల కారణంగా పృథ్వీకి టాలీవుడ్‌లో అవకాశాలు కూడా తగ్గిపోయాయని... మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు నటించే సినిమాల్లో ఆయనకు అవకాశాలు రావడం లేదనే ఊహాగానాలు వినిపించాయి.

మెగా ఫ్యామిలీతో పాటు ఇతర స్టార్స్ నటించే సినిమాల్లోనూ పృథ్వీకి ఛాన్స్‌లు రావడం లేదనే ప్రచారం కూడా సాగింది. దీంతో టాలీవుడ్‌లో పృథ్వీ కెరీర్ ఇక ముగిసినట్టు అనే పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో నటించిన పృథ్వీ... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి మెగాస్టార్‌కు ఆకాశానికెత్తేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మిగతా స్టార్స్ చిరంజీవిని పొగడటంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా... పృథ్వీ చిరంజీవిని పొగడటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పృథ్వీ మాటలు విన్న చాలామంది ఆయన ఏపీ సీఎం జగన్‌తో పాటు మెగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ కోసం టాలీవుడ్‌పై పొలిటికల్ ఎటాక్ చేసిన థర్టీ ఇయర్స్ పృథ్వీ... తాజాగా తన తీరు మార్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading