రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ కౌంటర్... తాట తీస్తానని వార్నింగ్

సినీనటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: August 15, 2019, 5:38 PM IST
రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ కౌంటర్... తాట తీస్తానని వార్నింగ్
రాజేంద్రప్రసాద్, పృథ్వీ
news18-telugu
Updated: August 15, 2019, 5:38 PM IST
సినీ పరిశ్రమ ప్రముఖులు, టాలీవుడ్ పెద్దల గురించి తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే తాను కోరారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పృథ్వీ తప్పుబట్టారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే సత్కారాలు చేసే సినీ పెద్దలు... జగన్ ముఖ్యమంత్రి అయితే కనీసం కలవడానికి కూడా రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అనేకమంది సినిమా వాళ్లు ఆయన నుంచి లబ్ది పొందారని పృథ్వీ వ్యాఖ్యానించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని పృథ్వీ వార్నింగ్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై తిరుమలలో స్పందించిన సినీనటుడు రాజేంద్రప్రసాద్... కొత్తగా ముఖ్యమంత్రి అయిన వారిని కళాకారులు కచ్చితంగా కలవాలనే రూల్ ఏమీ లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...