Recording Dance: వినాయక చవితికి కోవిడ్ ఆంక్షలు.. వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్సుల సంగతేంటి? వీడియో చూడండి

వైసీీపీ నేతల తీరుపై ట్రోలింగ్

Covid protocol: ఏపీలో వినాయక చవితి వేడులకు కోవిడ్ ప్రోటోకాల్ అంటూ ఆంక్షలు.. మరి వైసీపీ నేతల కార్యక్రమాలకు అవేవీ వర్తించవా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి.

 • Share this:
  Trolls in Social Media:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సీఎం జగన్ (AP CM Jagan) నిర్ణయంపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ నేతల తీరు వివాదస్పదంగా మారింది. సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి  (Vinayaka Chavithi) ఉత్సవాలకు అంతా సిద్దమయ్యారు. ఓ వైపు కరోనా కేసులు తగ్గడం.. మరోవైపు సినిమాహాళ్లు, స్కూళ్లు అన్నీ ప్రారంభం అవ్వడంతో.. ఇక వినాయక చవితి ఉత్సవాలు హ్యాపీ జరిపించుకోవచ్చని అంతా భావించారు. ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారు. కానీ ఊహించని రీతిలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు సామూహికంగా నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో పూజలు మాత్రమే చేసుకోవాలని.. బహిరంగ పూజలపై నిషేధం విధించారు. ఎవరైనా సామూహికంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. చాలావరకు పట్టణాలు గ్రామాల్లో సైతం పోలీసులు కఠినంగానే వ్యవహరించారు. కొందరు కోవిడ్ నిబంధనలు పాఠించి వేడుకలు చేసుకుంటామని చెప్పినా సరే.. స్టేజ్ లను బలవంతంగా కూల్చి వేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం జగన్ హిందూ వ్యతరికి అని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు జనగ్ తీరును విమర్శించారు. ముఖ్యంగా బీజేపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుని ఉద్యమాలు చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి జరిగింది. ఇడుపులపాయలో జరిగిన వర్ధంతిలో భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి అప్పుడు కనిపించని ప్రొటోకాల్ ఇప్పుడు వినాయక చవితికి ఎందుకు అని అంతా ప్రశ్నిస్తున్నారు..

  ఇదీ చదవండి: ఈ నెల 15న జగన్ బెయిల్ రద్దుపై తీర్పు.. 16 సీఎం ప్లాన్ ఇదే.. ఏం జరగబోతోంది?

  అంతేకాదు ఇటీవల వైసీపీ నేతలు సమావేశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు ఇటీవల భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరి ఈ నేతలు కోవిడ్ నిబంధనలను అధిగమించారు. వీరిలో ఒక్కరినైనా అరెస్ట్ చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలకు వర్తించని కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక ఉత్సవాలకే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు..

  ఇదీ చదవండి: ఈ వినాయకుడి చెవిలో చెబితే మీ కోర్కెలు నెరవేరుతాయి.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా..?

  తాజాగా మరో నేత చేసిన పని వివాదాస్పదమవుతోంది. మీట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు వైపీపీ ముఖ్య నేతలు.. అంతే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన కూడా హాజరయ్యారు. అయితే ఆయన హాజరు అవ్వడం తప్పు కాకపోవచ్చు.. ప్రమాణస్వీకరోత్సవం పేరుతో వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు.. ఓ వైపు భారీగా నేతలు, కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.. దానికి మంత్రితో సహా.. కీలక నేతలు అంతా ఉన్నారు.. మరి మీకు కోవిడ్ నిబంధనలు పట్టవా..? మీ రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి ఉన్నప్పుడు.. వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుంటే తప్పపేంటి అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ట్వీట్ చేశారు కూడా..

  YCP govt imposes so called covid protocol to prevent people from celebrating Ganesh Chaturthi.  అయితే ఏపీ ప్రభుత్వం.. వినాయక చవితి వేడుకలను నిషేధించినా.. ఏపీ హైకోర్టు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ప్రైవేటు స్థలాల్లో మాత్రమే వేడుకలను నిర్వహించుకోవాలని సూచించింది. కోరనా నిబంధనలు అమలు అయ్యేలా చూడాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. మరి ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి..
  Published by:Nagesh Paina
  First published: