నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్... రాయలసీమలో వైసీపీ గెలుపుపైనా సమీక్ష..?

AP Assembly Election 2019 : మరో ఎన్నికల ఫలితాలు రాబోతున్న సమయంలో... వైసీపీ అధినేత కడపలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 6:06 AM IST
నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్... రాయలసీమలో వైసీపీ గెలుపుపైనా సమీక్ష..?
వైఎస్ జగన్ (Image : Twitter)
  • Share this:
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కడప చేరుకున్నారు. రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లారు. ఇవాళ, రేపు ఆయన పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. ప్రధానంగా ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించబోతున్నారు. పులివెందులలోని బకరాపురంలో ఉన్న వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ప్రజలను కలుసుకోబోతున్నారు. అలాగ ఇవాళ సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొనబోతున్నారు. అక్కడ కూడా ముస్లింలు చెప్పే సమస్యల్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. గురువారం బకరాపురంలో మళ్లీ జగన్ ప్రజలను కలుసుకుంటారు. రెండోరోజు సమస్యలు తెలుసుకోబోతున్నారు.

ఫలితాలకు వారం ముందు జగన్ పులివెందుల పర్యటన వెనుక అసలు కారణం వేరే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై తన పులివెందుల పర్యటనలో జగన్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. పులివెందులలో తనకు రాబోయే మెజార్టీతో పాటు రాయలసీమ జిల్లాల్లో వైసీపీ విజయావకాశాలపై జగన్ సమీక్ష చేపట్టనున్నారు.

రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. కోస్తా జిల్లాలతో పోలిస్తే... తమకు ఎక్కువగా పట్టున్న ఈ ఆరు జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోంది. పులివెందుల పర్యటనలో భాగంగా ఈ ఆరు జిల్లాల నాయకులతో జగన్ సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నారు. ముందుగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం వల్ల వైసీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై వాస్తవాలు తెలుస్తాయని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జగన్ పులివెందుల పర్యటన తరువాత ఆ ఆరు జిల్లాల్లో పార్టీ విజయావకాశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?

ఏపీలో బుకీలకు షాక్... బెట్టింగ్ రద్దు చేసుకుంటున్న ప్రజలు... ఐపీఎల్ ఎఫెక్ట్...

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...
First published: May 15, 2019, 6:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading