Home /News /politics /

YCP CHIEF YS JAGAN FIXED TARGET 4 LAKH MAJORITY IN TIRUPATI LOKSABHA BY POLL NGS

Andhra Pradesh: తిరుపతిలో వైసీపీ టార్గెట్ ఫిక్స్: సీఎం జగన్ నిర్ణయంతో షాక్ తింటున్న మంత్రులు

టార్గట్ ఫిక్స్ చేసిన జగన్

టార్గట్ ఫిక్స్ చేసిన జగన్

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రుల ముందు జగన్ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారంట.. ఆ టార్గెట్ కచ్చితంగా రీచ్ అవ్వాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరుగుతోంది.

  ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల జోష్ ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది అధికార పార్టీ. వరుసగా మూడో విజయంతో తీన్మార్ ఆడాలని ఆశిస్తోంది. తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. హ్యట్రిక్ కొట్టి తీరుతామంటున్నారు నేతలు.. ఈ ఉప ఎన్నికలో విజయం తమదేనని మంత్రులు ముందే ఫిక్స్ అయ్యారు. అయితే అతి విశ్వాసానికి పోకుండా విజయం సాధించాలని మంత్రులకు చెప్పిన సీఎం జగన్.. వారి ముందు ఒక టార్గెట్ ఫిక్స్ చేశారంట. ఆ టార్గెట్ కచ్చితంగా రీచ్ అవ్వాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓ వైపు గెలుస్తామని ధీమా ఉన్నా.. అధినేత ఫిక్స్ చేసిన టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీనా అని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

  ఇటీవల పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత.. తిరుపతి ఉపఎన్నికలో గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని వైసీపీ ప్రకటించింది. రాజకీయాలకు కొత్త.. ఉన్నత విద్యావంతుడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై పాజిటివ్ టాక్ ఉందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. లాభ నష్టాలతో బేరీజు లేకుండా సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నా సానుకూల అంశం కూడా గురుమూర్తికి భారీ మెజార్టీ తీసుకొస్తుందని స్థానిక నేతలు, మంత్రులు అంచనా వేస్తున్నారు.

  తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్ చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. తిరుపతికి పేర్ని నాని, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డి, సత్యవేడు కొడాలి నాని, సూళ్లూరు పేటకు కన్నబాబు, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, గూడూరుకు అనిల్ కుమార్ యాదవ్ లను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఓవరాల్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లకు కట్టబెట్టారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో కనీసం 4 లక్షల మెజారిటీ తగ్గకుండా సాధించాలని సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

  తిరుపతి పార్లమెంటు బరిలో సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 13.20 లక్షల మంది ఓటేశారు. ఇందులో వైసీపీకి 7.22 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. 80 శాతం పోలింగ్ జరగగా.. 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. మరి ఈ దఫా సీఎం జగన్ కోరుతున్నట్లు 4 లక్షల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్ శాతం పెంచడంతో పాటు మరిన్ని అదనపు ఓట్లు సాధించడమే వైసీపీ ముందున్న లక్ష్యం. మున్పిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇటు టీడీపీ, అటు బీజేపీ,జనసేన కూటమి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. తిరుపతి కార్పొరేషన్ లో వార్ వన్ సైడ్ అయ్యింది. వైసీపీకి ఉన్న ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఇలా ఏ లెక్కన చూసినా 4 లక్షల మెజార్టీ రావాల్సిందే అని అధినేత అంచనా వేస్తున్నారు. అయితే ఆ ఫిగర్ చేరుకోవడం అంతా ఈజీనా అని మంత్రులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు, బై పోల్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఏపీ వ్యాప్తంగా ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉందనే ప్రచారాన్ని విపక్షాలు జోరుగా చేస్తున్నాయి.. ఇలాంటి సమయంలో వైసీపీ ఎంపీ భారీ మెజార్టీ నెగ్గడం అంత ఈజీ కాకపోవచ్చని భయపడుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Peddireddy Ramachandra Reddy, Perni nani, Tirupati, Tirupati Loksabha by-poll, Ys jagan, Ys jagan mohan reddy, YV Subba Reddy

  తదుపరి వార్తలు