వైసీపీలో కొత్త ముఖం... ఆ ముగ్గురికీ షాక్ ఇస్తున్న జగన్... ఏం జరుగుతోంది?

ఇప్పటివరకూ వైసీపీలో ఆ ముగ్గురు నేతలే... కీలకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వారికి చెక్ పెడుతున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారా?

news18-telugu
Updated: July 18, 2020, 1:27 PM IST
వైసీపీలో కొత్త ముఖం... ఆ ముగ్గురికీ షాక్ ఇస్తున్న జగన్... ఏం జరుగుతోంది?
వైసీపీలో కొత్త ముఖం... ఆ ముగ్గురికీ షాక్ ఇస్తున్న జగన్...(File)
  • Share this:
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అంచనా వెయ్యడం కష్టమే అభిప్రాయం ఆయన సన్నిహితుల్లో ఉంది. ఇందుకు కారణం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో... ఎవరికీ అర్థం కాకపోవడమే. ముఖ్యంగా... రాజకీయ అంశాల్లో జగన్ లోతైన విశ్లేషణలేవీ చెయ్యరు. అదే పనిగా పొలిటికల్ లెక్కలు వేసుకుంటూ కూర్చోరు. కానీ... వీలు చిక్కినప్పుడు మాత్రం... తనదైన శైలిలో ఆలోచిస్తూ... పార్టీలో తమకు తిరుగులేదు అనుకునేవారికి కూడా చెక్ పెడుతుంటారు. అధినేతలో ఆ మార్పు స్పష్టంగా కనిపించినా... ఆయన అలా ఎందుకు చేస్తున్నారో... సన్నిహితులకే అర్థం కాదు. అలాంటి ఓ వ్యూహరం ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు... పార్టీని వెంట ఉండి నడిపించినది ప్రధానంగా ముగ్గురు నేతలు. వాళ్లే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ... వీళ్లు జగన్ వెంటనే నిలిచారు. ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక... వీళ్లు ముగ్గురూ మరింత బిజీ అయ్యారు. చెప్పాలంటే... వైసీపీలో జగన్ ప్రధాన స్తంభమైతే... ఈ ముగ్గురూ మూడు మూలస్తంభాలుగా నిలిచారని అంటుంటారు. ఎందుకంటే పార్టీలో వీళ్ల పాత్ర అలా ఉంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... అది వీళ్ల అనుమతితోనే సాగుతోంది. ఇలా జగన్‌తో కలిసి ఈ ముగ్గురూ పార్టీని నడిపిస్తుండగా... ఇప్పుడు జగన్ నాలుగో పేరును తెరపైకి తెచ్చారు.

VPR... లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజ్యసభ ఎంపీ. పారిశ్రామిక వేత్త. నెల్లూరు జిల్లాపై పట్టున్న నేత. ఈయన కూడా వైసీపి మొదటి నుంచి మరో మూల స్తంభంగా ఉన్నా... పెద్దగా తెరపైన కనిపించేవారు కాదు. ముఖ్యంగా మీడియాలో అస్సలు కనిపించరు. కానీ... జగన్‌ను అన్ని విధాలా ఆదుకున్నవారిలో ఆయన పేరు కూడా ఉంది. ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు... ఆర్థికంగా పార్టీని ఆదుకున్నారు. అలాగే... సీమలో... పార్టీని పైకి తేవడంలో కృషి చేశారు. అందుకే జగన్ ఆయన సేవల్ని మర్చిపోలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత... జగన్ VPRవైపు చూస్తున్నట్లు తెలిసింది.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (File)


ఏపీలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలిన కర్నూలు, ప్రకాశం జిల్లాలపై ఫోకస్ పెట్టిన జగన్... వైవీ సుబ్బారెడ్డి ఇదివరకు చూసుకున్న ప్రకాశం జిల్లాతోపాటూ... కర్నూలు జిల్లా బాధ్యతల్ని ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు జగన్. తద్వారా... పార్టీలో VPR పాత్రను పెంచినట్లైంది. ఐతే... ప్రస్తుతం కర్నూలు, ప్రకాశం జిల్లాల వైసీపీ బాధ్యతల్ని ఇప్పటివరకూ సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారు. పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2గా కనిపిస్తున్న సజ్జలకు జగన్ తీసుకున్న నిర్ణయం షాక్ లాంటిదే. సజ్జల పాత్రను తగ్గించేందుకే జగన్ ఇలా చేశారా అనే డౌట్ వస్తోంది. ఎందుకంటే... జగన్ సీఎం అయిన తర్వాత... పార్టీ బాధ్యతల్ని సజ్జలకే అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అందుకే సజ్జలకు చెక్ పెట్టేలా జగన్ వ్యూహం రచించారా అనే డౌట్ వస్తోంది.

సజ్జల సన్నిహితుల వాదన మరోలా ఉంది. సజ్జలకు బాధ్యతలు ఎక్కువైపోవడంతో... ఆయనకు కాస్త రిలీఫ్ ఇచ్చినట్లవుతుందనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... జగన్ సడెన్‌గా తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీలో అంతర్గత చర్చలు దారితీసింది.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading