Home /News /politics /

YCP BIG VICTORY IN LATEST MUNICIPAL ELECTIONS BUT CM JAGAN MOHAN REDDY NOT ATTING ANY CAMPAIGN NGS VSP

AP Municipal Result: కాలు కదపలేదు.. ప్రచారం చేయలేదు.. ఓటు వేయమని అడగలేదు.. వార్ వన్ సైడ్.. ఎలా సాధ్యమైంది..?

కాలు కదపకుండానే వరుస విజయాలు

కాలు కదపకుండానే వరుస విజయాలు

AP Mincipal Result: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక అంటే.. గెలుపు ఒకవైపే ఉంటోంది. అసెంబ్లీ ఎన్నికలైనా.. ఎంపీ ఎన్నికైనా.. స్థానిక సంస్థల ఎన్నికైలనా.. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేదు.. రాయలసీమ, కోనసీమ, కోస్తా ఆంధ్ర అనే బేధం లేదు.. సామాజిక వర్గాలతో సంబంధం లేదు.. బరిలో వైసీపీ అభ్యర్థి బరిలో ఉంటే.. ప్రత్యర్థి పార్టీలు పరారే.. పేరుకే అక్కడ పోటీ.. ఒక్క బంతి కూడా పడకుండా సిక్సర్ కొట్టినట్టు.. కౌంటింగ్ పూర్తి కాకముందే ఫలితం తేలిపోతోంది.. ఫ్యాన్ గాలిముందు ప్రత్యర్థి పార్టీలు తలో దిక్కున పడుతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతోంది..

ఇంకా చదవండి ...
  P. Anand Mohan, Visakhapatnam, News18.                               AP Mincipal Result: పోల్ మేనేజ్ మెంటా..? అధికార బలమా..? సంక్షేమ పథకాలకు ఆదరణ..? దాడులు.. దారుణాలా..? ప్రతిపక్ష పార్టీలపై నమ్మకం లేదా..? కారణం ఏదైనా.. ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లో ఎన్నిక అంటే.. వార్ వన్ సైడ్ అనే టాక్ ఫిక్స్ అయ్యింది. అది కూడా వైఎస్ఆర్ సీపీ  (YSRCP) అధినేతగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. క్యాంపు కార్యాలయం నుంచి కాలు కదపడం లేదు.. అడుగు బయట పెట్టడం లేదు. జనం లోకి వెళ్లి ఓట్లు వేయమని అడగడం లేదు.. ప్రచారం పేరుతో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం లేదు. ప్రజా వ్యతిరేకత ఉంది అనే విమర్శలను తిప్పి కొట్టడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగడం లేదు.. అది చేశాను.. ఇది చేశాను అని చెప్పడం లేదు... కొట్టిన డప్పే కొట్టు కోవడం లేదు. గంటలు గంటలుగా మీడియా ముందు స్పీచ్ లు ఇవ్వడం లేదు.. అయినా ఆయన పార్టీ ప్రభంజనం ఆగడం లేదు. పేరుకే ఎన్నిక జరుగుతోంది.. ఫలితం ఏక గ్రీవాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలైతే లక్షల్లో మెజార్టీ వస్తోంది. స్థానిక ఎన్నికలైతే క్లీన్ స్వీప్ అవుతోంది. ఆయన అడుగు బయట పెట్టకపోయినా ఇలాంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి..

  కారణం ఏదైనా కావచ్చు.. ఏపీ ఓటర్లు వైసీపీని వరుసగా గెలిపిస్తున్నారు. మరోసారి ఉప ఎన్నికల్లోనూ పెండింగ్ ఎన్నికల్లోనూ వైసీపీకి జైకొట్టారు. ఇదంతా కూడా వైసీపీ అధినేత.. ఏపీ సీఎం కాలు కదపకుండానే చేయిస్తున్నారు. అనుచరులను నమ్ముతున్నారు.. సరైన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన నేరుగా రంగంలోకి దిగడం లేదు. కనీసం ఒక్క ఎన్నికల క్యాంపెయన్ లోనూ ఆయన కనిపించలేదు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే చాలా ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికలు.. మున్సిపల్ పోరు.. తిరుపతి ఉప ఎన్నిక, బద్వేల్ ఉప ఎన్నిక ప్రస్తుత ఎన్నికలు. అందులో ఎక్కడ జగన్ స్పీచ్ వినిపించలేదు.. కనీసం ఓటర్లను కలిసింది లేదు. అభ్యర్థుల తరపున ఓట్లు వేయండని మీడియా ముఖంగా అడిగింది లేదు. అయినా విజయం ఆయన పక్షానే ఉంటోంది..

  ఇదీ చదవండి : గ్రామాలే కాదు.. నగరాలు వైసీపీ వెంటే.. విజయానికి అదే కారణమంటూ సీఎం జగన్ ట్వీట్

  ప్రతిపక్ష టీడీపీ చెబుతున్నట్టు.. కాదు కాదు ఆరోపిస్తున్నట్టు సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం దాటట్లేదు. 2019లో ఎలక్షన్ గెలిచిన నాటి నుంచీ నేటిదాకా.. ఆయన గట్టిగా ఓ పది పదిహేను సార్లే కదులుంటారు. అదీ ఎన్నికల విషయమై ఆయన ఏనాడూ ఎక్కడా కాలు కదిపింది లేదు. ఏ ఓటర్ నీ ఓటు వేయండి అని అడగలేదు. తమ అభ్యర్ధిని గెలిపించాలి అంటూ కోరలేదు. ఆయన విజయం ఆయన వెంటే ఉంటోంది.

  ఇదీ చదవండి :కుప్పం మున్సిపాలిటీ ఫైనల్ ఫలితం ఇదే.. ఏ పార్టీ ఎన్నివార్డులు గెలిచాయి.. టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

  దాదాపు నాలుగు సార్లు ఓటింగ్ ప్రక్రియ రాష్ట్రంలో జరిగింది. అయినా.. సీఎం ఎక్కడికీ వెళ్లలేదు. కేవలం మంత్రులు.. సలహాదారులే కనిపించారు.. అంటే ఓటర్ మదిలో సీఎం ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదని వైసీపీ అభిమానులు ఢంకా బజాయిస్తున్నారు. ఇదంతా జగన్ చరిష్మాతోనే జరుగుతోందని వారు అంటున్నారు. కంటెంట్ ఉన్నాడికి కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. అంటూ ఆయన అనుచరులు జగన్ బొమ్మ పట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగిపోతున్నారు.

  ఇదీ చదవండి : కుప్పంలో చంద్రబాబుకు ఇక కష్టమే.. ప్రతి ఏడాది తగ్గుతున్నగ్రాఫ్.. కారణం అదేనా?

  కానీ ప్రతిపక్షాలు మాత్రం జగన్ చరిష్మా తగ్గింది అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఫలితాలు మాత్రం జగన్ అన్న ఒక పార్టీ అధినేత కాదు.. జగన్ అన్నది బ్రాండ్ అంటున్నారు. ఫ్యాన్ గుర్తును గుండెల్లో దాచుకుంటున్నారు. పోలింగ్ బూత్ కు వెళ్లగానే ఫ్యాన్ గుర్తు తప్ప వారికి మరేది కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నా.. అది ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఇప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ ఢోకా లేదంటున్నారు.

  ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్‌ బిశ్వబూషన్‌ హరిచందన్ కు పాజిటివ్

  ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం.. అది కూడా ఆయన కంచుకోట అలాంటి చోట అధికార పార్టీ నెగ్గాలి అంటే.. సీఎం నేరుగా ప్రచారానికి రావాలి.. కానీ కేవలం మంత్రి పెద్ది రెడ్డికి కుప్పం మున్సిపల్ ఎలక్షన్ బాధ్యతల్ని అప్పగించారు జగన్. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆయన కటౌట్ పెట్టుకుని గత రెండు నెలల నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కుప్పంలోనే కూర్చుంది.

  ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్‌ బిశ్వబూషన్‌ హరిచందన్ కు పాజిటివ్

  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిధున్ రెడ్డి, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి అక్కడ్నించే అన్నీ చేశారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలు.. వ్యూహాలు అక్కడ పనిచేయలేదు. పెద్ది రెడ్డి వ్యూహాలు మాత్రమే అక్కడ ఫలించాయన్నది నిర్వివాదాంశం. ఇదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందనడంలో సందేహం లేదు. ప్రత్యక్షంగా సీఎం కుప్పంలో అడుగుపెట్టక పోయిన వైసీపీ ధాన్ ధన్ విజయం సాధించింది. ప్రతిపక్ష టీడీపి హిట్ వికెట్ అయ్యింది. అయితే ఇదంతే కేవలం అధికారం చేతిలో ఉండడంతోనే సాధ్యమవుతోందా..? లేకా 2024 సాధారణ ఎన్నికలకు ఇదే ఛరిష్మా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Municipal Elections

  తదుపరి వార్తలు