కోర్టులకు డుమ్మా కొట్టేందుకే.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి సెటైర్లు..

కోర్టులకు డుమ్మా కొట్టేందుకే సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, దాన్నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో కేసులను పరిష్కరించుకోవాలనుకున్నారని అన్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 5:31 PM IST
కోర్టులకు డుమ్మా కొట్టేందుకే.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి సెటైర్లు..
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
  • Share this:
కోర్టులకు డుమ్మా కొట్టేందుకే సీఎం జగన్ పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, దాన్నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో కేసులను పరిష్కరించుకోవాలనుకున్నారని అన్నారు. అయితే, హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా సొంత కేసులు, డిశ్చార్జి పిటిషన్లు, కోర్జు హాజరు నుంచి మినహాయింపుల గురించే అడుగుతున్నారని ఆరోపించారు. అటు.. ఫెమా, మనీలాండరింగ్‌పై సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందుకే.. గత మూడు శుక్రవారాలుగా ఏదో ఒక వంకతో కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారని విమర్శించారు. కేసుల్లో విచారణ వేగవంతం కావడం, శిక్షపడే అవకాశాలున్నాయన్న భయం జగన్‌కు పట్టుకుందని మాజీ మంత్రి అన్నారు. త్వరలో జరిగే సమావేశాల్లో వైసీపీ వైఫల్యాలను ఎండగడతామని యనమల ఉద్ఘాటించారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>