YANAMALA RAMAKRISHNUDU OPEN LETTER TO AP SPEAKER TAMMINENI SITARAM AK
ఏపీ స్పీకర్‌కు... మాజీ స్పీకర్ బహిరంగ లేఖ
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
స్పీకర్ స్థానంలో ఉంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన టీడీపీ నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎవరూ చేయలేదని గుర్తు చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరును టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. ఈ మేరకు యనమల తమ్మినేనికి బహిరంగ లేఖ రాశారు. స్పీకర్ స్థానంలో ఉంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఎవరూ చేయలేదని గుర్తు చేశారు. సభ లోపల ఉంటేనే స్పీకర్.. బయటకు వస్తే స్పీకర్‌ను కాదనే ధోరణి సరైంది కాదని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎంత వరకు సబబే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానంలో ఉన్నవారికి ఎంతమాత్రం తగదన్నారు.
తప్పుడు ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానానికే కళంకం అని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ గా అందరి గౌరవం పొందాల్సిన బాధ్యత తమ్మినేనిపై ఉందని అన్నారు. స్పీకర్‌గా విశిష్టమైన స్థానంలో ఉంటూ ఆ విశిష్టతను దెబ్బ తీసేలా తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని సీతారాం కు రాసిన లేఖలో యనమల పేర్కొన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.