వైసీపీ విధానాలతో రాష్ట్రం చిన్నాభిన్నం.. టీడీపీ సీనియర్ నేత ఫైర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అభివృద్ది పనులపై, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.

news18-telugu
Updated: September 19, 2020, 3:02 PM IST
వైసీపీ విధానాలతో రాష్ట్రం చిన్నాభిన్నం.. టీడీపీ సీనియర్ నేత ఫైర్
యనమల రామకృష్ణుడు(ఫైల్ ఫొటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అభివృద్ది పనులపై, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కోవిడ్ నియంత్రణపై నిర్లక్ష్యం కూడా ఇందుకు మరో కారణమని చెప్పారు. అభివృద్ధి అంటే ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రాజకీయ రంగాల సమగ్రాభివృద్ధి అని అన్నారు. కానీ వైసీపీ అపసవ్య విధానాలు, అవినీతి కుంభకోణాలో రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందని ఆరోపించారు.

ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగాల కల్పన లేక యువతలో అశాంతి నెలకొందని విమర్శించారు. గత ఏడాది ఫస్ట్ క్వార్టర్ కు, ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ కు అప్పులు 363% మండిపడ్డారు. పన్నులు పెంచి 16 నెలల్లోనే రూ. 20వేల కోట్ల పన్నుల భారం వేశారని ఆరోపించారు. గ్రాస్ ఫిక్స్ డ్ కేపిటల్ ఫార్మేషన్(జిఎఫ్‌సీఎఫ్) దారుణంగా క్షీణిస్తుందన్నారు. ఎగుమతుల ప్రోత్సాహక ఇండెక్స్‌లో ఏపీని 21వ ర్యాంకుకు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్ విడుదల చేశారు.

"ఎస్‌బీఐ అంచనాల ప్రకారం జీడీపీలో 24 శాతం తగ్గుదల ఉంది. ఏపీ జీఎస్‌డీపీలో అదే స్థాయి 24 శాతం క్షీణతతో రూ. 2,35,000 కోట్ల తగ్గుదల ఉంది. 2020-21 జీఎస్‌డీపీ రూ. 7,19,782కోట్లకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఏపీ జీఎస్‌డీపీలో అవుట్‌పుట్‌లో మైనస్ 73%. తలసరి ఆదాయం రూ. 40,648 తగ్గిపోయే అవకాశం. తలసరి ఖర్చులు, పొదుపు తగ్గిపోతాయి. నిత్యావసరాల ధరలు, పన్నులు పెంచేసి పేదల బతుకు దుర్భరం చేశారు. పారిశ్రామిక రంగంలో క్షీణత 10.4%, సేవారంగంలో క్షీణత 15%గా ఉంది. దీనితో పెట్టుబడులు రావు, కొత్త పరిశ్రమల స్థాపన ఉండదు. వైసీపీ చేతగాని తనంతో రాష్ట్రానికి చేటు చేస్తుంది.. అవినీతితో అనర్థాలు చోటుచేసుకుంటాయి. సహజ వనరులన్నీ వైసీపీ నాయకుల దోపిడి చేస్తున్నారు. శాండ్‌-ల్యాండ్ మాఫియా, వైన్‌-మైన్ మాఫియా పెరుగుతోంది. వైఎస్ జగన్ పాలనలో వైసీపీ నాయకులు సుఖాలు, ప్రజలకు దు:ఖాలు మిగిలాయి. ప్రభుత్వం.. 'జగన్ కోసం, జగన్ కొరకు, జగన్ చేత' మాత్రమే ఉంది.. 'ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత' కాదు. ఆర్థికవేత్త జాన్ కీన్స్ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి. ఆర్థికావ‌ృద్దికే అప్పులు తెచ్చుకోవాలి తప్ప.. అనుత్పాదక వ్యవయానికి అప్పులు తేరాదు" అని యనమల తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading