ఏపీలో కరోనా వ్యాప్తికి అదే కారణం... మండిపడ్డ యనమల

ప్రభుత్వం చేస్తున్న పరీక్షల్లో ఎంత నిజముందో తెలియదు కానీ అవినీతి మాత్రం స్పష్టంగా బయటపడిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

news18-telugu
Updated: April 22, 2020, 1:32 PM IST
ఏపీలో కరోనా వ్యాప్తికి అదే కారణం... మండిపడ్డ యనమల
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
  • Share this:
ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందటానికి కారణం సీఎం జగన్ ఆలోచనా విధానాలే అని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా అవినీతికి, రాజకీయాలకే జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ కట్టడి చేసే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. పరీక్షలు చేసే పరిస్థితి అంతకంటే లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న పరీక్షల్లో ఎంత నిజముందో తెలీదు కానీ అవినీతి మాత్రం స్పష్టంగా బయటపడిందని యనమల ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలు కరోనాను అరికట్టడంలో చిత్తశుద్ధితో ఉన్నాయి కాబట్టే కేసులు పెరగలేదని అన్నారు.

కరోనా పరీక్షల్లో వాస్తవాలు దాచిపెడుతున్నారని యనమల ధ్వజమెత్తారు. నచ్చిన విధంగా వాస్తవాలను మార్చి బయటకు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగానే ఇంకా తగ్గుదల నమోదుకాకుండా కేసులు పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆదాయం బాగానే ఉందన్న యనమల... కేంద్రం నుంచి సాయం అందుతోందని తెలిపారు. అయితే ఆ నిధుల్ని మాత్రం కరోనా కట్టడికి కాకుండా తన కాంట్రాక్టర్లకు మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

First published: April 22, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading