Home /News /politics /

YALAMANCHILI MLA KANNABABU RAJEH THREATEN YCP REBELS CANDIDATES SON IN LAW FOR FILING NOMINATIONS IN PANCHAYAT ELECTIONS IN VISAKHAPATNAM DISTRICT OF ANDHRA PRADESH PRN

AP Panchayat Elections: వైసీపీ రెబల్ అభ్యర్థికి ఎమ్మెల్యే బెదిరింపులు.., రంగంలోకి దిగిన జనసేన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సమయంలో ఏకగ్రీవాల కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుజ్జగింపులు, బెదిరింపులు, ప్రలోభాల పర్వానికి తెరలేస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఏకగ్రీవాల కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుజ్జగింపులు, బెదిరింపులు, ప్రలోభాల పర్వానికి తెరలేస్తోంది. ఐతే పల్లెల్లో బుజ్జగింపుల కంటే బెదిరింపుల పర్వమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనల్లో పంచాయతీల కోసం ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఏకగ్రీవం కోసం ఓ వార్డు మెంబర్ అభ్యర్థి అల్లుడ్ని బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే బెదిరిస్తున్న కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటంటే బెదిరించి ఇతర పార్టీ కార్యకర్తను కాదు. సొంతపార్టీకి చెందిన రెబల్ అభ్యర్థిని కన్నబాబురాజు బెదిరించినట్లు తెలుస్తోంది.

    వివరాల్లోకి వెళ్తే.., రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ శివారులోని సీతాపాలెం క్గామానికి చెందిన లాలం సంతోష్ కుమార్ మామ.. వైసీపీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేయాలనుకున్నారు. కానీ స్థానిక నేతలు వ్యతిరేకించడంతో రెబల్ గా నామినేషన్ వేశారు. ఈ వివాదంలో డైరెక్ట్ గా ఎమ్మెల్యే కన్నబాబు రాజు జోక్యం చేసుకున్నారు. సంతోష్ కు ఫోన్ చేసి నామినేషన్ వెనక్కి తుకోవాలని లేకుంటే మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. తనకెందుకు చెప్తున్నారని.. తన మామకే ఫోన్ చేయాలని సంతోష్ కోరగా ఎమ్మెల్యే మాత్రం తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరించారు.

    ఇది చదవండి: ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. మరోసారి భారీగా అధికారుల బదిలీ


    ఫోన్లో ఎమ్మెల్యే బెదిరిస్తున్న సంభాషణను రికార్డ్ చేసిన సంతోష్.., దాని ఆధారంగా రాంబిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతోష్ కు మద్దతుగా జనసనే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన పోలీసులు కాల్ రికార్డ్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    ఇది చదవండి: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల వ్యయ పరిమితి ఎంతో తెలుసా..?


    పంచాయతీ ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి బెదిరింపుల పర్వం, ఆడియో కాల్ రికార్డ్స్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. అన్నకొడుకుతో సంభాషించిన ఆడియో సంచలనం సృష్టించగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మాజీ మంత్రిపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే విషయంలో అదే రకంగా స్పందించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Janasena party, Local body elections, Visakhapatnam, Vizag, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు