Uttar Pradesh Assembly Elections : ఉత్తరప్రదేశ్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది. అధికార-విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష నేతలు తరచూ పాక్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా(Muhammad Ali Jinnah)పేరును లేవనెత్తుతున్నారు. రెండు నెలల క్రితం జిన్నా పేరును ప్రస్తావిస్తూ మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) ప్రయత్నించారు. పాకిస్థాన్ జాతిపిత..భారత విభజనకు కారణమైన మహమ్మద్అలీ జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ అఖిలేష్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారనీ..వీరందరూ భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. వారు ఎలాంటి పోరాటంలో పాల్గొనడం మానుకోలేదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అఖిలేష్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సైలెంట్ గా ఉన్న అఖిలేష్..తాజాగా పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భారత్ కు నిజమైన శత్రువు పాకిస్థాన్ కాదని,పాకిస్తాన్ రాజకీయ శత్రువు మాత్రమేనని, బీజేపీ ఓటు బ్యాంకు రాజీకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath) ఖండించారు. సర్దార్ పటేల్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తుంటే, సమాజ్‌వాదీ పార్టే నేత మాత్రం పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలి జిన్నాను ఆరాధిస్తున్నారని శుక్రవారం ఓ ట్వీట్లో విమర్శించారు. "వాళ్లు జిన్నా ఆరాధకులు. మేము సర్దార్ పటేల్‌ను అభిమానిస్తాం. పాకిస్థాన్ అంటే వాళ్లకు చాలా ఇష్టం. మేము మా భారతి కోసం ప్రాణాలిస్తాం'' అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే జిన్నా పేరును ఎందుకు లేవనెత్తుతారో తనకు అర్ధం కావడం లేదని, తాము రైతుల గురించి మాట్లాడుతుంటే, వాళ్లు జిన్నా ప్రస్తావన చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు.
वे 'जिन्ना' के उपासक है, हम 'सरदार पटेल' के पुजारी हैं।
उनको पाकिस्तान प्यारा है, हम माँ भारती पर जान न्योछावर करते हैं।
ముస్లిం ఓట్ల కోసమే అఖిలేష్ యాదవ్ జిన్నా భజన చేస్తూ పాకిస్తాన్‌ను నెత్తికెత్తుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరికొందరు సమాజ్‌వాది పార్టీ నేతలు కూడా జిన్నా, పాకిస్థాన్ పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఈ అంశం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఇక,యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీతో మొదలై ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.