అందుకే తప్పుకొన్నాం.. అమరావతిపై ప్రపంచబ్యాంక్ స్పందన

కేంద్రం లేఖను ఆధారంగా చేసుకుని అమరావతికి రుణ ప్రతిపాదనను ప్రపంచబ్యాంక్ రద్దు చేసుకున్నట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 19, 2019, 7:57 PM IST
అందుకే తప్పుకొన్నాం.. అమరావతిపై ప్రపంచబ్యాంక్ స్పందన
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 19, 2019, 7:57 PM IST
అమరావతికి 300 మిలియన్ డాలర్ల రుణం రద్దుపై ప్రపంచబ్యాంక్ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం రుణ దరఖాస్తు ఉపసంహరించుకోవడం వల్లే తాము రద్దు చేశామని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. టీడీపీ హయాంలో బలవంతపు భూసేకరణ చేశారని ప్రపంచబ్యాంకుకు రాజధాని రైతులు, స్వచ్ఛంద సంస్ధల ఫిర్యాదు చేశారు. బలవంతపు భూసేకరణ ఫిర్యాదులపై టీడీపీ హయాంలోనే ప్రపంచబ్యాంకు బృందం క్షేత్రస్ధాయి విచారణ జరిపింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అక్రమాలపై విచారణ తర్వాత రుణం ఇస్తామంటూ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఇప్పుడే రుణం తీసుకోవడంపై ఏమీ తేల్చలేమంటూ కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసిలింది. జగన్ ప్రభుత్వ లేఖ తర్వాత రాజధాని భూసేకరణపై విచారణ వద్దంటూ ప్రపంచబ్యాంకుకు కేంద్రం లేఖ రాసింది. అమరావతి భూసేకరణపై దర్యాప్తు చేయిస్తే ఆ ప్రభావం దేశంలో మిగిలిన ప్రాజెక్టులపైనా పడుతుందని ఆ లేఖలో వెల్లడించింది. దీంతో రుణ దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రపంచబ్యాంకుకు రాసిన లేఖలో పేర్కొంది. కేంద్రం లేఖను ఆధారంగా చేసుకుని అమరావతికి రుణ ప్రతిపాదనను ప్రపంచబ్యాంక్ రద్దు చేసుకున్నట్టు తెలిసింది.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...