Breaking : అమరావతి ప్రాజెక్టు నుంచి ‘డ్రాప్’ అయిన వరల్డ్ బ్యాంక్

Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టు డెవలప్‌మెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ‘డ్రాప్’ అయింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

news18-telugu
Updated: July 18, 2019, 7:51 PM IST
Breaking : అమరావతి ప్రాజెక్టు నుంచి ‘డ్రాప్’ అయిన వరల్డ్ బ్యాంక్
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టు డెవలప్‌మెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ‘డ్రాప్’ అయింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. (కింద ఫొటో చూడొచ్చు.). ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 715 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అందులో పేర్కొంది. అందులో 300 మిలియన్ డాలర్లను ముందుగా ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి ‘డ్రాప్’ అయినట్టు ఇప్పుడు వెబ్‌సైట్‌లో అధికారికంగా నమోదు చేసింది. అయితే, దీనికి సంబంధించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ నరసింహం చెప్పినట్టు ఔట్‌లుక్ వెబ్‌సైట్ తెలిపింది. సీఆర్డీఏ అభివృద్ధికి నిధులు కావాలంటూ 2016లో దరఖాస్తు చేసుకుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి 300 మిలియన్ డాలర్లు, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి 200 మిలియన్ డాలర్లు రుణం కోరింది. అయితే, రాజధాని కోసం భూ సమీకరణలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున రైతులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిధులు ఆగిపోయినట్టు తెలిసింది. నిన్నటి వరకు ప్రాజెక్టు పైప్‌లైన్‌లో ఉన్నట్టు స్టేటస్‌లో ఉండగా, తాజాగా ‘డ్రాప్’ అయినట్టు చూపింది.

అమరావతి ప్రాజెక్టు నుంచి ‘డ్రాప్‌ అయినట్టు వరల్డ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో స్టేటస్ అప్ డేట్


2014లో చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజల నుంచి 34వేల ఎకరాలను సమీకరించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కొందరు టీడీపీ నేతలు ముందుగానే అక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు రైతుల ఇష్టం లేకుండా భూసేకరణ చేశారని చంద్రబాబు మీద విమర్శలు వచ్చాయి.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>