Andrha Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కేసులో అసలు కథ ఏంటి? అధికార, విపక్ష వాదనల్లో ఏది నిజం

చంద్రబాబు, అమరావతి లోగో, నారాయణ

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య రోజూ మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఆరేళ్ల కిందట రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన భూసేకరణను అధికార వైసీపీ నేతలు బయటపెడుతున్నామంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇరు వర్గాల్లో ఎవరి వాదన నిజం

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి భూములు.. సీఐడీ కేసులు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆదేశించడంతో.. ఈ వ్యహారంపై ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ విచారణపై నాలుగు వారాల పాటు హైకోర్టు స్తే ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలు ఊరట చెందారు. అంతే కాదు వైసీపీ నేతలు కక్ష కట్టి.. కట్టు కథలు అల్లుతున్నారంటూ రైతులతో మాట్లాడిన వీడియోలు రిలీజ్ చేసింది టీడీపీ. అయితే వైసీపీ మాత్రం టీడీపీ కీలక నేతల చుట్టు ఉచ్చు బిగుసుకుందని.. జస్ట్ వారికి నాలుగు వారాలు విరామం మాత్రమే ఉందని.. తరువాత వారిపై చర్యలు తప్పవంటూ వాధిస్తున్నారు..

  ప్రస్తుతం అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య రోజూ మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఆరేళ్ల కిందట రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన భూసేకరణను అధికార వైసీపీ నేతలు బయటపెడుతున్నామంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు.. అమరావతిలో ఎలాంటి అవకతవకలు లేవని వైసీపీ నేతలకు తెలుసని.. కానీ రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే అబద్ధాపు సాక్ష్యాలు పుట్టిస్తున్నారని.. తమకు అన్యాయం జరగలేదని రైతు అంటుంటే వారిని బెదిరించి మరీ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

  రాజధాని వస్తుందనే ముందే తెలియడంతో.. కొందరు బడాబాబులు బలవంతంగా దళితుల భమూలు లాక్కుని.. తరువాత సమీకరణకు వచ్చి తరువాత మళ్లీ ప్లాట్లు పొందారని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. భూసేకరణ పేరుతో జరిగిన దోపిడీని వెలికి తీయాలంటూ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరై.. అసైన్డ్ భూములనున బలవంతంగా లాక్కున్నారు అన్నదానిపై సాక్ష్యాలు కూడా ఇచ్చాను అని చెబుతున్నారు ఆర్కే. కేవలం చంద్రబాబు తన సొంత మనుషుల కోసమే అసైన్డ్‌భూముల సమీకరణ కోసం జీవో నెంబర్ 41ను ప్రత్యేకంగా తెచ్చారని ఆర్కే విమర్శిస్తున్నారు.

  వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. దళితుల పేరుతో తప్పుడు కేసులు పెట్టించి.. తరువాత వారితో కట్టుకథలు అల్లుతున్నారని మండిపడుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా చూపించారు పార్టీ సీనియర్‌ ధూళ్లిపాళ్ల నరేంద్ర. తమ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసుల్లో అధికార పార్టీ కుట్ర కనిపిస్తోందని మండిపడ్డారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉండడం ఇష్టం లేకపోవడంతో.. ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

  ఇలా అసైన్డ్ భూముల కేసుల వ్యవహారంలో రెండు పార్టీలు ఢీ అండే ఢీ అని కౌంటర్లు వేసుకుంటున్నాయి. మరోవైపు సీఐడీ అధికారులు దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నారు. తుళ్లూరు పీఎస్‌లో రైతుల నుంచి సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. భయపెట్టి ఎవరెవరు అసైన్డ్‌ భూముల కొన్నారు అన్నదానిపై ఆరా తీసినట్టు సమాచారం. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం రైతుల నుంచి కూడా స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు సీఐడీ అధికారులు. హైకోర్టు తీర్పుకు నాలుగు వారాలే సమయం ఉండడంతో విచారణను మరింత ముమ్మరం చేశారు.
  Published by:Nagesh Paina
  First published: