బూతులు తిట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

పీసీసీ ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్‌కు నిరంజన్ చెప్పడంతో గొడవ మొదలైంది.

news18-telugu
Updated: September 8, 2020, 6:01 PM IST
బూతులు తిట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గాంధీ భవన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రభస చోటు చేసుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, టి నిరంజన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఏం ప్లాన్ చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలను కోరారు. ఎన్నికల కోసం స్ట్రాటజీ ప్లాన్ తయారు చేయాలని నాయకులకు సూచించారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య వాగ్వాదం మొదలైంది. పీసీసీ ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్‌కు నిరంజన్ చెప్పడంతో గొడవ మొదలైంది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ దాసోజు శ్రవణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇరువురు నేతలు బూతులు తిట్టుకున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పద్ధతి, ప్రోటోకాల్ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్... ఇందుకోసం కొన్ని నెలల ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 8, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading