దిగొచ్చిన జగన్.. పీపీఏల జోలికి వెళ్లబోనని కేంద్రానికి లేఖ

YS Jagan on PPAs | సీఎం జగన్ వెనుకడుగు వేశారు. ఇప్పటికే అమలవుతున్న పీపీఏల జోలికి పోమని, అసలు అమలుకాని వాటిని సమీక్షిస్తామని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది.

news18-telugu
Updated: September 11, 2019, 8:46 PM IST
దిగొచ్చిన జగన్.. పీపీఏల జోలికి వెళ్లబోనని కేంద్రానికి లేఖ
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకడుగు వేశారు. చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని గతంలో ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వాటి జోలికి వెళ్లబోమని కేంద్రానికి స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత పీపీఏల జోలికి వెళ్లబోమని, ఇంకా ఖరారుకాని ఒప్పందాల మీద మాత్రమే దృష్టి సారిస్తామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే, అందులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీపీఏలపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. దీనిపై కొన్ని కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. కడప, అనంత జిల్లాకు చెందిన ఎస్‌బీఈ, అయిన, స్పింగ్ కంపెనీల ఏపీ సర్కార్ నిర్ణయాన్ని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63, కేంద్రం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది సరికాదని వ్యాఖ్యానించింది.

ys jagan,amaravati,ys jagan amaravathi,ys jagan house in amaravathi,ys jagan new house in amaravathi,ys jagan on ap capital,ys jagan new house,ys jagan on ap capital change,botsa on amaravati,jagan gives clarity on amaravati change to donakonda,jagan mohan reddy,jagan reddy on andhra special status,jagan fun on babu,jagan,ys jagan vs chandrababu,tg venkatesh,tg venkatesh shocking comments on ap,amaravati,pawan kalyan serious on tg venkatesh comments,tg venkatesh comments,k kesava rao fires on tg venkatesh,pawan kalyan fires on tg venkatesh,tg venkatesh about chandrababu,tdp mp tg venkatesh comments,mp tg venkatesh,tg venkatesh vs pawan kalyan,bjp mp tg venkatesh shocking,tg venkatesh with media,bjp mp tg venkatesh
సీఎం జగన్, ప్రధాని మోదీ


మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీఏల విషయంలో పునరాలోచించాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అనవసరంగా కంపెనీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభిప్రాయం కలిగితే రాష్ట్రంలో పెట్టుబడులు రావని నచ్చజెప్పింది. అయితే, తాము పీపీఏల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, జగన్ ప్రభుత్వం తీరు మీద జపాన్ కంపెనీ కేంద్రానికి లేఖ రాసింది. వీటికితోడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కూడా జగన్ తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని ఆర్కే సింగ్ అన్నారు. ఈ వివాదం ముదరడంతో జగన్ వెనుకడుగు వేశారు. ఇప్పటికే అమలవుతున్న వాటి జోలికి పోమని, అసలు అమలుకాని వాటిని సమీక్షిస్తామని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading