దేశాన్ని దోచుకున్నవారు ఫాం హౌస్‌లో ఉన్నా వదలం: బండి సంజయ్

కామారెడ్డి సభలో బీజేపీ నేతలు

దేశాన్ని దోచుకున్న దొంగ‌లు ఎక్క‌డ ఉన్న వారిని ప‌ట్టి జైల్లో పెడుతామ‌ని ఆయ‌న అన్నారు. నల్లొండ జిల్లా గుర్రం పాడు గ్రామంలో గిరిజన భూములను కాపాడాలని కోరుతూ పోరాడితే 40మంది కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టిన సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు.

 • Share this:
  ( పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్ 18)

  దేశాన్ని దోచుకున్నవారు లండన్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఫాంహౌస్‌లో ఉన్నా వదిలిపెట్టబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప‌ట్ట‌ణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ బహిరంగ స‌భ నిర్వ‌హించారు.. ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్, నిజామాబాద్ ఎంపీ ధర్మ‌పురి ఆర్వింద్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరుణ తార త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ల్యాద్రి రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కాషాయం కండువా క‌ప్పి మ‌ల్యాద్రిని పార్టీలోకి ఆహ్వ‌నించారు. ఆయనతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్త కొండ బాస్కర్, నార్ల సురేష్, బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీనా హన్మంతరావు, వర్ని కాంగ్రెస్ సర్పంచ్ బుజ్జి, బాన్సువాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ ల‌ను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

  ఆనంత‌రం బండి సంజ‌య్ స‌భ‌ను ఉద్యేశించి మాట్లాడారు.. మ‌న దేశం నుంచి త‌ప్పించుకుని పారిపోయిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండ‌న్ కోర్టు భార‌త్ కు అప్ప‌గించేందుకు అంగీకరించింది. దేశాన్ని దోచుకున్న దొంగ‌లు ఎక్క‌డ ఉన్న వారిని ప‌ట్టి జైల్లో పెడుతామ‌ని ఆయ‌న అన్నారు. నల్లొండ జిల్లా గుర్రం పాడు గ్రామంలో గిరిజన భూములను కాపాడాలని కోరుతూ పోరాడితే 40మంది కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టిన సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు. కేంద్ర పథకాలను దారి మళ్లించి వారి ప్రభుత్వం పథకంగా చెప్పుకుంటున్నారని, బాన్సువాడ లో పోచారం ఇద్దరు కుమారులు చెరో దందా ఇసుక, కంకర దందాలో దొంచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలంటే రాముడు లాంటి వారికి అవకాశం ఇవ్వాలి అన్నారు.

  ఎంపీ ఆర్వింద్ మాట్లాడుతూ.. బాన్సువాడలో ఇసుక మాఫియా నడుస్తోందని, మంజీరా నదిలో ఇసుక దోపిడి సాగిస్తున్నారని, పోచారం కుటుంబం దశాబ్దాలుగా గబ్బిలంగా పట్టిపీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలతో ఇష్టారాజ్యంగా ఇసుక తోడెస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల ఆగడాలను కట్టడి చేస్తామని అన్నారు. బండి సంజయ్‌ ‌నేతృత్వంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: