HOME »NEWS »POLITICS »wont be surprised if rahul gandhi leaves country tomorrow senas sanjay raut

రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యంలేదు

రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యంలేదు
సంజయ్ రౌత్(ఫైల్ ఫోటో)

పార్టీ అధ్యక్షుడిగా విఫలమైనందునే రాహుల్ గాంధీ తన పదవిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. తనకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని రాహుల్ గాంధీ పార్టీకి సూచించి ఇప్పటికి ఏడు రోజులు గడిచినా...ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరూ ప్రత్యామ్నాయంగా లేరని ఎద్దేవా చేశారు.

  • Share this:
    లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపటి రోజు దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటూ శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో వీక్లీ సంపాదకీయం రాసిన సంజయ్ రౌత్ రాహుల్ గాంధీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చాలా దూకుడుగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాహుల్ గాంధీ మౌనంవహిస్తున్నారని, అజ్ఞాతంలో ఉంటున్నారని విమర్శించారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాహుల్ రాజీనామా చేశారని చెప్పారు. రేపటి రోజు ఆయన విరక్తితో దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.

    sanjay raut on rahul gandhi, maharastra, shiv sena, rahul gandhi news, రాహుల్ గాంధీ, సంజయ్ రౌత్, శివసేన, కాంగ్రెస్, మహారాష్ట్ర
    రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)




    కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరు తీవ్రతరమైందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా విఫలమైనందునే రాహుల్ గాంధీ తన పదవిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. తనకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని రాహుల్ గాంధీ పార్టీకి సూచించి ఇప్పటికి ఏడు రోజులు గడిచినా...ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరూ ప్రత్యామ్నాయంగా లేరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయాలకు, రాహుల్ గాంధీ వైఫల్యాలకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని పేర్కొన్నారు.

    మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కమిటీలను బీజేపీ, శివసేనలో విలీనం చేసేందుకు ముందుకు వస్తున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ కోమాలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై ఆ పార్టీ నేతలు ఆశలు వదులుకుని, ప్రత్యామ్నాయం వెతుక్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ భవితవ్యం అంధకారంగా మారిందన్నారు.
    First published:June 03, 2019, 12:48 IST

    टॉप स्टोरीज