హోమ్ /వార్తలు /National రాజకీయం /

Bumper Offer to Villegers: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు

Bumper Offer to Villegers: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు

గ్రామస్తులకు మహిళా సర్పంచ్ బంపర్ ఆఫర్

గ్రామస్తులకు మహిళా సర్పంచ్ బంపర్ ఆఫర్

Super Sarpanch: ఓ మహిళ సర్పంచ్ చేసిన పని శభాష్ అనిపిస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..?

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

Cash offer to villagers: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ మహిళా సర్పంచ్ (Women Sarpanch) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.  లాక్ డౌన్ పుణ్యమా అని నాటు సారకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. గతేడాది మార్చ్ నెలలో కరోనా విజృంభన కొనసాగిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దింతో మద్యం దుకాణాలు మూడు నెలల పాటు పూర్తిగా మూతబడ్డాయి. మద్యం దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటే.. వారికి సారా ఊరటనిచ్చింది. ఇక చిత్తూరు జిల్లా (Chitoor District) నుంచి సారా ఏరులై పారింది.. రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లోని మందు బాబుల (Drinkers) దాహాన్ని తీర్చింది. కానీ నాటు సారాపై నిషేధమున్న పట్టించుకోని కొందరు తయారీ దారులు....ఇప్పటికీ సారా తయారు చేస్తూనే ఉన్నారు. తాజాగా నాటు సారా తయారు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళ సర్పంచ్ సంకల్పించారు. పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసే నాటుసారా తయారీ దారుల ఆచూకీ చెప్పిన... విక్రయించే వారి పేరు చెప్పిన పారితోషకం ఇస్తానంటున్నారు ఆ సర్పంచ్.. ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ఇలాకాలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం విశేషం

వివరాల్లోకి వెళితే.... చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నాటు సారా తయారు కల్చర్ అధికంగానే ఉంటుంది. జిల్లాలో  ఏరులై పారె నాటు సారా మొత్తం లో 40 నుంచి 45 శాతం ఈ నియోజకవర్గంలోనే తయారు అవుతోంది. ఎక్సైజ్ అధికారులు ఎన్ని నాటుసారా తయారీ స్థావరాలపై దాడి చేసిన వేరొక చోట సారా కస్తూనే ఉన్నారు.


ఇదీ చదవండి: గ్రామ సమస్యలపై సీఎంకు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు.. ఏం జరిగిదంటే..?

ఇక శ్రీరంగారాజపురం  మండలం (Srirangarajpruam mandal) పుల్లూరు గ్రామానికి చెందిన సర్పంచ్ భావ్య శ్రీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధులో ఉన్న గ్రామంలో సారా రహిత ప్రాతంగా తీర్చిదిద్దే  ప్రయతం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఊరు వాడ దండోరా వేయించారు. నాటు సారా తయారు చేస్తున్న వారి పేర్లను., వికరియించే వారి పేర్లను చెప్పిన... చూపించిన వారికి బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించారు. గ్రామంలో నాటు సారా తయారు చేసే వారి వివాలు చెప్నిపిన వారికి  10వేలు, ఆ సారాను విక్రయించే వారిని చూపించిన వారికి  5 వేల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు. ఇక నాటుసారా కాచే వారికి....విక్రయించే వారి రేషన్., ఇతర ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తానని దండోరా ద్వారా హెచ్చరిక జారీ చేశారు భవ్యశ్రీ. సర్పంచ్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chitoor, Villagers

ఉత్తమ కథలు