పవన్ కల్యాణ్‌కు షాక్.. జనసేన సభలో జగన్‌కు నమస్కారం..

తన సభలో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ షాక్ తిన్నారు. కొద్ది సేపటి దాకా ఆయన తేరుకోలేదు. వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు.. ఇది వైసీపీ మీటింగ్ కాదని.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 6:57 PM IST
పవన్ కల్యాణ్‌కు షాక్.. జనసేన సభలో జగన్‌కు నమస్కారం..
పవన్ కళ్యాణ్ (File)
  • Share this:
చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురయింది.   అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. 'జనసేన అధినేత జగనన్నకు నమస్కారం' అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనబోయి పొరపాటున ఆమె 'జగనన్న' అని ఆమె సంబోధించింది.

ఆమె ప్రసంగంతో జనసేన సభా ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది. అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక తన సభలో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ షాక్ తిన్నారు. కొద్ది సేపటి దాకా ఆయన తేరుకోలేదు. వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు.. ఇది వైసీపీ మీటింగ్ కాదని.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. దాంతో ఆ మహిళ నాలుక కరచుకుంది. పొరపాటున అలా నోటికి వచ్చిందని సర్దిచెప్పి.. మళ్లీ ప్రసంగం కొనసాగించింది.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>