Monkeys Attack: కోతుల దాడిలో మహిళ మృతి.. సూర్యాపేటలో విషాదం

ప్రతీకాత్మక చిత్రం

కోతులు ఒక్కసారిగా ఆమె వైపు రావడంతో.. భయంతో ఇంట్లోకి పరుగులు తీసింది శ్రీలత. ఈ క్రమంలోనే కిందపడి గడపకు తల బలంగా తాకడంతో తీవ్రగాయమైంది.

  • Share this:
    తెలుగ రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువయింది. గుంపులు గుంపులుగా వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ మహిళ మరణించింది. స్థానికుతు తెలిపిన వివరాల ప్రకారం.. ఏమద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన దోమల శ్రీలత అనే 25 ఏళ్ల మహిళకు రెండు నెలల బాబు సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఇంట్లో పనిచేసుకుంటున్న సమయంలో ఇంటి ప్రాంగణంలోకి కోతుల మంద వచ్చింది. వాటిని వెళ్లగొట్టేందుకు ఆమె ప్రయత్నించింది. ఐతే అవి ఒక్కసారిగా ఆమె వైపు రావడంతో.. భయంతో ఇంట్లోకి పరుగులు తీసింది శ్రీలత. ఈ క్రమంలోనే కిందపడి గడపకు తల బలంగా తాకడంతో తీవ్రగాయమైంది. అనంతరం అక్కడికక్కడే ఆమె మరణించింది. శ్రీలత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళ మృతి చెందిన వార్త తెలిసి స్థానికులు కంటతడి పెట్టారు. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని.. అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: