బాపట్లలో వింత శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి..

గుంటూరు జిల్లా బాపట్లలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించింది. మూడు చేతులతో ముక్కు,చెవులు సరిగా లేని రూపంలో శిశువు జన్మించింది.

news18-telugu
Updated: December 15, 2019, 11:04 AM IST
బాపట్లలో వింత శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి..
ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 84.83 శాతం ఉండగా, లడఖ్‌లో 84.31 శాతం ఉంది. ఇక తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,705కి చేరింది.
  • Share this:
గుంటూరు జిల్లా బాపట్లలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించింది. మూడు చేతులతో ముక్కు,చెవులు సరిగా లేని రూపంలో శిశువు జన్మించింది. దంపతులది మేనరిక వివాహం కావడంతో జన్యుపరమైన లోపాల వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఐదో నెలలో స్కానింగ్ చేసినప్పుడే శిశువుకు లోపాలు ఉన్న సంగతిని వైద్యులు గుర్తించలేకపోయారని అన్నారు. 8 నెలలో ఆ గర్భిణి తమ వద్దకు వచ్చినప్పుడు శిశువుకు లోపాలున్నట్టు గుర్తించామని.. కానీ ఎనిమిదో నెల కావడంతో గర్భస్రావానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.
గతంలోనూ ఈ దంపతులకు కాళ్లు,చేతులు లేకుండా ఓ శిశువు జన్మించి చనిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు.
Published by: Srinivas Mittapalli
First published: December 15, 2019, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading