వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు

క్రమార్కులకు వంత పాడడమే కాకుండా... బాధితులకు అండగా ఉన్న లాయర్ కుటుంబాన్ని వేధిస్తారా? అని విమర్శిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 25, 2020, 6:42 AM IST
వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. హెచ్ఆర్సీలో మహిళ ఫిర్యాదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తన కుటుంబాన్ని వేధిస్తున్నారని హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు బనాయించి ఎమ్మెల్యే భాస్కరరావు వేధిస్తున్నారని మణెమ్మ అనే మహిళ ఆరోపించారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారని.. వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన భర్త లాయర్‌గా పనిచేస్తున్నాడని.. ఎమ్మెల్యే బాధితుల తరపున కేసులు వాదిస్తున్నాడని.. మణెమ్మ తెలిపారు. ఐతే బాధితులకు అండగా ఉన్నందుకు తన భర్తపై కక్షగట్టి.. అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. భాస్కర్ రావు అక్రమాలను ప్రశ్నించినందుకు తన భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు మణెమ్మ.

ఎమ్మెల్యే భాస్కర రావు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అక్రమార్కులకు వంత పాడడమే కాకుండా... బాధితులకు అండగా ఉన్న లాయర్ కుటుంబాన్ని వేధిస్తారా? అని విమర్శిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే భాస్కరరావు ఖండించినట్లు తెలిసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. రాజకీయ ప్రత్యర్థులే తనపై కుట్ర చేస్తున్నారని విమర్శించినట్లు సమాచారం. కాగా, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు జులైలో కరోనా బారినపడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అనంతరం కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఐతే ఎమ్మెల్యే తీరుపై మహిళ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Published by: Shiva Kumar Addula
First published: September 25, 2020, 6:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading