మంత్రి హరీష్ రావు కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన 36 ఏళ్ల తలారి పార్వతమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. పుల్కల్ తాసిల్దార్ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: November 15, 2019, 10:55 PM IST
మంత్రి హరీష్ రావు కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం
బాధితురాలు పార్వతమ్మ
  • Share this:
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్న డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవంలో కలకలం రేగింది. తనకు ఇల్లు ఇవ్వలేదంటూ మంత్రి కార్యక్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. సింగూరులో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన 36 ఏళ్ల తలారి పార్వతమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. పుల్కల్ తాసిల్దార్ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్వతమ్మ భర్త ఐదేళ్ల క్రితం మూర్ఛ వ్యాధితో బాధపడి మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కనీసం ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. గుంట భూమి కూడా లేదు. కూలి పని చేస్తే గాని పూట గడవని పరిస్థితి వాళ్లది. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కింద తమకు ఇల్లు ఇవ్వాలని ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఐనా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడంతో.. తమ గోడును మంత్రి ముందు చెప్పేందుకు వెళ్లింది. మంత్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అక్కడే ఉన్న పుల్కల్ తహసిల్దార్ గమనించి ఆమె వద్ద నుంచి కిరోసిన్ సీసాను లాక్కునేందుకు యత్నించాడు. దీంతో ఇద్దరికి పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో కిరోసిన్ ఇద్దరి పై పడింది. అక్కడే ఉన్న పోలీసులు మంత్రికి సమాచారం తెలవనీకుండా బలవంతంగా అమెను అక్కడినుంచి తరలించినట్లు సమాచారం. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి అనంతరం ఇంటికి పంపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇల్లు కట్టించాలని పార్వతమ్మ అధికారులకు వేడుకుంది.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>