రేప్స్,ఇన్‌సెస్ట్ సెక్స్ లేనిదే ఇంత జనాభా..? బాప్‌రే.. అమెరికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

US Politician Bizarre statements : అబార్షన్ నిషేధ బిల్లుకు మద్దతునిస్తున్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి స్టీవ్ కింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

news18-telugu
Updated: August 15, 2019, 9:28 AM IST
రేప్స్,ఇన్‌సెస్ట్ సెక్స్ లేనిదే ఇంత జనాభా..? బాప్‌రే.. అమెరికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
స్టీవ్ కింగ్ (Image: Reuters)
  • Share this:
వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రిపబ్లికన్ కాంగ్రెస్‌ నేత స్టీవ్ కింగ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చరిత్రలో అత్యాచారాలు, ఇన్‌సెస్ట్(రక్త సంబంధీకుల మధ్య సెక్స్) లేనిదే ప్రపంచ జనాభా ఇంతలా పెరిగిందా..? అని ప్రశ్నించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారుడైన స్టీవ్ కింగ్.. అబార్షన్ నిషేధ బిల్లును సమర్థిస్తున్నారు. డెమోక్రాట్స్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.అత్యాచార,ఇన్‌సెస్ట్ కేసులకు అబార్షన్ నిషేధం చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టీవ్ కింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అత్యాచారాలు,ఇన్‌సెస్ట్‌ను సమర్థించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు అత్యాచారాలు,ఇన్‌సెస్ట్ లేకుండా ఇంత ప్రపంచ జనాభా ఉంటుందా..? అని ప్రశ్నించారు.తొమ్మిది సార్లు చట్టసభలకు ఎంపికైన స్టీవ్ కింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగుతోంది. స్టీవ్ కింగ్ తక్షణం రాజీనామా చేయాలని డెమోక్రాట్స్ కిర్‌స్టెన్ గిల్లీబ్రాండ్,బెర్ని సాండర్స్ డిమాండ్ చేశారు.

ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి అన్ని కుటుంబాల వంశవృక్షాలను పరిశీలించండి.. ఉదాహరణకు అందులో నుంచి ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకోండి. ఆ వ్యక్తి కచ్చితంగా రేప్ లేదా ఇన్‌సెస్ట్ ద్వారా పుట్టినవాడై ఉంటాడు. కాబట్టి అబార్షన్‌లను నిషేధిస్తే ప్రపంచంలో అసలు జనాభా ఉంటుందా..? ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో అనేక యుద్దాలు, అత్యాచారాలు,దోపిడీలు జరిగాయి. కాబట్టి నేనలా పుట్టలేదు అని చెప్పడానికి ఎవరికీ ఆస్కారం లేదు.
స్టీవ్ కింగ్,అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ ప్రతినిధి

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>