క్యూలైన్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కాసేపట్లో ముగియనున్న నామినేషన్లు

క్యూలైన్‌లో ఉన్న కేజ్రీవాల్ టోకెన్ నెం.45. నామినేషన్ దాఖలు చేసేందుకు వేచిచూస్తున్నానని.. భారీగా నామినేషన్లు దాఖలవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Updated: January 21, 2020, 3:26 PM IST
క్యూలైన్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కాసేపట్లో ముగియనున్న నామినేషన్లు
క్యూలైన్‌లో ఉన్న కేజ్రీవాల్ టోకెన్ నెం.45. నామినేషన్ దాఖలు చేసేందుకు వేచిచూస్తున్నానని.. భారీగా నామినేషన్లు దాఖలవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజధానిలో హీటెక్కిస్తున్నాయి. ఆమాద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇక అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడే ఆఖరు రోజు. ఇప్పటి వరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయలేదు. మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తున్న సమయంలో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఐతే ఆయన వెళ్లేసరికే అక్కడ భారీగా క్యూలైన్ ఉంది. అప్పటికే అక్కడ 50 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు క్యూలో వేచి ఉన్నారు.

క్యూలైన్‌లో ఉన్న కేజ్రీవాల్ టోకెన్ నెం.45. నామినేషన్ దాఖలు చేసేందుకు వేచిచూస్తున్నానని.. భారీగా నామినేషన్లు దాఖలవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి యువమోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు