#పల్లెపోరు : అక్కడ 18 ఓట్లు వస్తే చాలు.. సర్పంచ్ అయిపోయినట్టే..

ఇంత తక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని పంచాయతీ చేయడానికి కారణం.. దీని చుట్టుపక్కల ఇతర గ్రామాలేవి లేకపోవడమే. అడవి ప్రాంతం కావడం.. ఇతర గ్రామాలతో రోడ్ కనెక్టివిటీ లేకపోవడం.. మండల కేంద్రానికి దూరంగా ఉండటంతో.. దీన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు.

Srinivas Mittapalli | news18-telugu
Updated: January 11, 2019, 1:07 PM IST
#పల్లెపోరు : అక్కడ 18 ఓట్లు వస్తే చాలు.. సర్పంచ్ అయిపోయినట్టే..
దొంగతోగు గ్రామం..
Srinivas Mittapalli | news18-telugu
Updated: January 11, 2019, 1:07 PM IST
ఆ ఊళ్లో సర్పంచ్‌గా పోటీ చేయడం చాలా సులువు. పెద్దగా ప్రచారం చేయనక్కర్లేదు.. అంతకుమించి పెద్దగా ఖర్చు చేయనక్కర్లేదు. 18 ఓట్లు వస్తే చాలు.. సర్పంచ్ అయిపోయినట్టే లెక్క. ఏంటి మరీ ఇంత తక్కువ ఓట్లా అనుకుంటున్నారా?.. అవును మరి.. ఆ ఊరి ఓటరు జనాభా మొత్తం 36 మాత్రమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు 'దొంగతోగు'.

నిజానికి ఈ గ్రామ జనాభా 106. కానీ ఇందులో ఓటు హక్కు కలిగినవారు 36 మంది మాత్రమే. కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు సాధిస్తే గట్టి పోటీనిచ్చినట్టే లెక్క. పది పైన మరో ఎనిమిది ఓట్లు సంపాదించగలిగారంటే.. ఇక సర్పంచ్ గిరీ తమదే. ఒకవేళ త్రిముఖ పోటీ ఉన్నట్టయితే.. సర్పంచ్ గిరీకి కావాల్సిన ఓట్లు మరింత తగ్గుతాయి. ఇంత తక్కువ జనాభా ఉన్న ఈ గ్రామాన్ని నాలుగు వార్డులుగా విభజించారు. అంటే వార్డుకు తొమ్మిది మంది ఓటర్లు. ఈ లెక్కన ఐదు ఓట్లు సంపాదించగలిగారంటే వార్డు మెంబర్ అయిపోయినట్టే.


ఇంత తక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని పంచాయతీ చేయడానికి కారణం.. దీని చుట్టుపక్కల ఇతర గ్రామాలేవి లేకపోవడమే. అడవి ప్రాంతం కావడం.. ఇతర గ్రామాలతో రోడ్ కనెక్టివిటీ లేకపోవడం.. మండల కేంద్రానికి దూరంగా ఉండటంతో.. దీన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారు. తమ గ్రామాన్ని పంచాయతీగా చేయడంపై అక్కడివారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటామని అంటున్నారు.

కాగా, ఇదే కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో అడవిరామం అనే మరో గ్రామ పంచాయతీ ఉంది. ఇక్కడి గ్రామ జనాభా 170 మంది కాగా.. ఓటర్లు మాత్రం 64 మందే ఉన్నారు. ఈ లెక్కన 33 ఓట్లు వచ్చాయంటే గ్రామ సర్పంచ్ అయిపోయినట్టే. ఒకవేళ త్రిముఖ పోటీ ఉన్నట్టయితే సర్పంచ్ పదవికి కావాల్సిన ఓట్లు మరింత తగ్గుతాయి.


First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...