రసవత్తరంగా హూజర్ నగర్ ఉప ఎన్నిక.. రంగంలోకి చంద్రబాబు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు, ఇటీవల పలు దెబ్బలు తిన్న తెలుగుదేశం పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

news18-telugu
Updated: October 3, 2019, 2:54 PM IST
రసవత్తరంగా హూజర్ నగర్ ఉప ఎన్నిక.. రంగంలోకి చంద్రబాబు
చంద్రబాబునాయుడు
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు, ఇటీవల పలు దెబ్బలు తిన్న తెలుగుదేశం పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి సపోర్ట్ చేస్తోంది. దీంతో సీపీఎంను మద్దతు కోరుతోంది టీడీపీ. ఆ పార్టీ తరఫున చావా కిరణ్మయి బరిలో దిగుతున్నారు. సీపీఎం అభ్యర్థి పి.శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో తమ అభ్యర్థికి మద్దతివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి కోరారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. తొలుత, సీపీఎం, సీపీఐ కలసి అభ్యర్థిని బరిలోకి దించాలని భావించాయి. అయితే, ఆ పొత్తులు కుదరకపోవడంతో సీపీఎం అభ్యర్థిని బరిలోకి దించింది. అయితే, ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదే సమయంలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతిస్తోంది.

టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ, టీటీడీపీకి సీపీఎం మద్దతు పలుకుతుండడంతో టీజేఎస్‌ మద్దతు కోరేందుకు కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి రంగంలోకి దిగారు. టీజేఎస్ అధినేత ప్రొ.కోదండరాంను కలిశారు. చర్చల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డికి మద్దతివ్వడానికి టీజేఎస్ ముందుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర వ్యవసాయం, ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుత ప్రభుత్వం మీదే కాదు, మొత్తం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని నారాయణరెడ్డి అన్నారు.

మరోవైపు టీటీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి తరఫున ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలకు హుజూర్‌నగర్‌లో ప్రచారం చేయాలని సూచించారు. దీంతోపాటు తాను కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ - టీడీపీ కలసి పోటీ చేశాయి. అప్పట్లో చంద్రబాబు, రాహుల్ గాంధీ కలసి కొన్నిచోట్ల ప్రచారం చేశారు. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే తమకే ఎక్కువ లబ్ధి జరుగుతుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే చంద్రబాబు వ్యతిరేకత టీఆర్ఎస్ అభ్యర్థికి కలసివస్తుందని అంచనా వేస్తున్నారు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...