నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు... చర్చకు వచ్చే అంశాలివే...

తొలిరోజు సమావేశాల్లో దిశ ఘటనపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే మహిళా భద్రతపై ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను వెల్లడించవచ్చు.

news18-telugu
Updated: December 9, 2019, 5:10 AM IST
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు... చర్చకు వచ్చే అంశాలివే...
Video : ఏపీలో మూడు రాజధానులు.. జగన్ సంచలన ప్రకటన
  • Share this:
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం కేంద్రంతో జరిపిన చర్చలు, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఎస్సీ-ఎస్టీలకు అమలుచేస్తున్న పథకానికి సంబంధించిన ప్రశ్నలు ప్రభుత్వానికి ఎదురుకానున్నాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వం రిజర్వేషన్స్ అమలుచేస్తోందా?, సూళ్లూరుపేట, తిరుపతి రహదారి పనులు వంటి ప్రశ్నలు చర్చకు రానున్నాయి. విద్యుత్ రంగ సంస్కరణలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఏపీ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి తెలంగాణ మంత్రితో జరిపిన చర్చల సారాంశం, పాయకరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుపై కూడా ప్రశ్నలు ఎదురుకానున్నాయి. తొలిరోజు సమావేశాల్లో దిశ ఘటనపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే మహిళా భద్రతపై ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను వెల్లడించవచ్చు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తాజా సమావేశాల్లో ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంది.

ఇక ఇదే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు టీడీపీ 21 అంశాలను సిద్దం చేసుకుంది. వాటిలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఉల్లి ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, అమరావతి నిర్మాణం తదితర అంశాలతో టీడీపీ వైసీపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>