మోదీకి మరుసటిరోజే షాకిచ్చిన ట్రంప్...ఏమన్నాడంటే...?

కలిసి పనిచేస్తామని హోస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే తన మాట మార్చారు.

news18-telugu
Updated: September 24, 2019, 8:09 AM IST
మోదీకి మరుసటిరోజే షాకిచ్చిన ట్రంప్...ఏమన్నాడంటే...?
మోదీ, ట్రంప్
  • Share this:
అమెరికాలో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. అయితే... మోదీకి హోస్టన్ సభ ముగిసిన రెండోరోజే అమెరికా అధ్యక్షుడు షాక్ ఇచ్చారు. భారత్-అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు కలిసి పనిచేస్తామని హోస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే తన మాట మార్చారు. భారత్‌‌తో పాటు .. ప్రధాని మోదీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ మధ్యవర్తిత్వం అంశంపై మరోసారి స్పందించారు.

ఆదివారం మోదీతో పాటు హోస్టన్ సభలో పాల్గొన్న ట్రంప్... ఆ మరుసటి రోజు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ నోట మళ్లీ కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చింది. భారత్‌, పాక్‌లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందన్నారు ట్రంప్. అయితే ఈ విషయంలో భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని ట్రంప్‌ పేర్కొన్న మరుసటి రోజే భారతీయులంతా అవాక్కయ్యేలా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...