Home /News /politics /

WILL YS JAGANMOHAN REDDY KEEP PROMISE OF MAKING NTR DISTRICT IN ANDHRA PRADESH BA

నందమూరి లక్ష్మీపార్వతి చిరకాల కోరిక... జగన్ నెరవేర్చే టైమ్ వచ్చిందా?

వైఎస్ జగన్, నందమూరి లక్ష్మీపార్వతి (File)

వైఎస్ జగన్, నందమూరి లక్ష్మీపార్వతి (File)

నందమూరి లక్ష్మీపార్వతి చిరకాల కోరిక ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారా? ప్రస్తుతం వైసీపీలో కూడా ఈ చర్చ నడుస్తోంది.

    నందమూరి లక్ష్మీపార్వతి చిరకాల కోరిక ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారా? ప్రస్తుతం వైసీపీలో కూడా ఈ చర్చ నడుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 12 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని జగన్ సూచనగా చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు కొత్త జిల్లాల మీద రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారకరామారావు పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చిరకాల కోరికల్లో అది కూడా ఒకటి. ఎన్టీఆర్‌కు భారతరత్నం ఇప్పించాలి, అలాగే, ఎన్టీఆర్ పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం. జగన్ కూడా ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఎన్టీఆర్ పేరు మీద కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారా? లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

    జగన్ చెప్పిన ప్రకారం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చనున్నారు. అంటే, ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఒకవేళ మచిలీపట్నం పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే.. దానికి ఎన్టీఆర్ పేరు పెడతారా? లేదా? అనేది కృష్ణా జిల్లాలోని వైసీపీ, టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Lakshmi Parvathi, NTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు