మోదీ ప్రమాణ స్వీకారానికి జగన్ వెళ్లరా ? డౌటే మరి ?

మధ్యాహ్నం 12. 23 నిమిషాలకు జగన్ కొత్త సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జగన్ సభ ముగిసే సరికి 1.15 నిమిషాలు అవ్వనుంది. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: May 30, 2019, 9:21 AM IST
మోదీ ప్రమాణ స్వీకారానికి జగన్ వెళ్లరా ? డౌటే మరి ?
నరేంద్ర మోదీ, వైఎస్ జగన్
news18-telugu
Updated: May 30, 2019, 9:21 AM IST
మరికొన్ని గంట్లలో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలకు ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోమన్ రెడ్డి వెళ్తారా లేదా అన్నదానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే జగన్ కూడా ఇవాళ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12. 23 నిమిషాలకు జగన్ కొత్త సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జగన్ సభ ముగిసే సరికి 1.15 నిమిషాలు అవ్వనుంది. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానిక దేశ విదేశాల నుంచి వేలాదిమంది అతిథులు తరలివస్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అతిథుల తాకిడితో ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలంటే, కనీసం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఢిల్లీలో దిగేలా రావాలని అక్కడి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఢిల్లీ నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది.

ఫ్లైట్‌లో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే సుమారు రెండున్నర గంటల వరకూ సమయం పడుతుంది. ఎంత త్వరగా బయలుదేరినా అధికారులు చెప్పిన సమయానికి జగన్ విమానం చేరుకునేది కష్టమే. ఇక సకాలంలో జగన్ చేరగలుగుతారా? అన్న సందిగ్ధతతో ఉన్న అధికారులు, ఇంకా జగన్ ఢిల్లీ ప్రయాణాన్ని ఖరారు చేయలేదు. మరోవైపు ఢిల్లీలో జగన్ విమానం ల్యాండ్ అయ్యేందుకు కొంత అదనపు సమయాన్ని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో... వేచి చూస్తున్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. జగన్ ప్రయాణం ఖరారు అయ్యేఅవకాశాలు కనిపిస్తున్నాయి.
==================

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...