• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • WILL TRY TO GET MORE MAJORITY THAN MEDAK LOKSABHA KTR CHALLENGES HARISH RAO AK

‘మీ కంటే ఎక్కువ తెచ్చుకుంటాం’...హరీశ్‌రావుకు కేటీఆర్ సవాల్

‘మీ కంటే ఎక్కువ తెచ్చుకుంటాం’...హరీశ్‌రావుకు కేటీఆర్ సవాల్

కేటీఆర్, హరీశ్ రావు(File)

తెలంగాణలో టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్, బీజేపీతో కాదన్న కేటీఆర్... టీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ విషయంలో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మెదక్ లోక్ సభ స్థానం అంటే ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించే స్థానమని... ఆయన లోక్‌సభ సీటు కంటే తాను ప్రాతినిథ్యం వహించే కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని కేటీఆర్ అన్నారు.

 • Share this:
  త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణలో టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్, బీజేపీతో కాదన్న కేటీఆర్... టీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ విషయంలో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మెదక్ లోక్ సభ స్థానం అంటే ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించే స్థానమన్న కేటీఆర్... ఆయన లోక్‌సభ సీటు కంటే తాను ప్రాతినిథ్యం వహించే కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని అన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.

  అంతకుముందు ఈ సమావేశంలో మాట్లాడిన మాజీమంత్రి హరీశ్ రావు... మెదక్ జిల్లా నుంచి పోటీ చేయబోయే అభ్యర్థికి ఐదు లక్షలకు తగ్గకుండా మెజార్టీ రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే మెదక్ జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లోక్‌సభ అభ్యర్థికి ఐదు లక్షల మెజార్టీ రావాలని హరీశ్ రావు చెప్పడంతో... కరీంనగర్‌లో అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని కేటీఆర్ సరదాగా సవాల్ విసిరారు.
  First published: