Home /News /politics /

WILL THERE IS A BIG PLAN BEHIND RAGHURAMAKRISHNAM RAJ RESIGNATION COMMENTS HERE IS THE DETAILS AK

రఘురామ రాజీనామా ప్రకటన వెనుక అంత భారీ ప్లాన్ ఉందా ?.. అంతా ఒక్కటవుతారా ?

రఘురామకృష్ణంరాజు (ఫైల్ ఫోటో)

రఘురామకృష్ణంరాజు (ఫైల్ ఫోటో)

AP Politics: రఘురామ నిజంగానే రాజీనామా చేస్తారా ? లేక కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారా ? అన్నది చూడాల్సి ఉంది.

    విపక్షాల విమర్శలు ఏ స్థాయిలో ఉన్నా.. ఏపీలో మాత్రం ఇప్పటికీ అధికార వైసీపీ బలంగా ఉంది. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో ఈ విషయం మరోసారి తేలిపోయింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితి మారితే.. ఆ వెంటనే తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజకీయపార్టీలు భావిస్తుంటాయి. తాజాగా ఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అంతకంటే ముందు తానే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ ప్రకటించడం సంచలనంగా మారింది. కేవలం రాజీనామా చేయడం మాత్రమే కాదు.. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉండాలనే నినాదంతో తాను మళ్లీ జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

    అయితే రఘురామ ఇంత హఠాత్తుగా ఈ రకమైన ప్రకటన చేయడం వెనుక అసలు కారణం ఏమిటనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి దూరమైన తరువాత రఘురామ బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఆయన రాజీనామా తరువాత ఎన్నికలు జరిగితే ఆయన బీజేపీ తరపున బరిలోకి దిగడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే బీజేపీని నమ్ముకుని బరిలోకి దిగితే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందనే విషయం ఆయనకు తెలియనిది కాదు. అందుకే అమరావతి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి.. అమరావతికి మద్దతిచ్చే పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా వైసీపీతో పోటీ పడాలని ఆయన భావిస్తున్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

    ఏపీలోని వైసీపీని ఎదుర్కోవాలంటే మిగిలిన ప్రధాన పార్టీలు.. అందులోనూ టీడీపీ, జనసేన మద్దతు కీలకమని ఆయన భావిస్తున్నారని.. అందుకే అమరావతి నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. టీడీపీ, జనసేన మద్దతు తనకు లభిస్తుందని ఆయన భావించి ఉండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే రఘురామ నిజంగానే రాజీనామా చేస్తారా ? లేక కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారా ? అన్నది చూడాల్సి ఉంది.

    YCP MP: పదవికి రాజీనామా.. వైసీపీ ఎంపీ సంచలన ప్రకటన.. నెక్స్ట్ ఏంటి..?

    AP Politics: ఆ నేతలకు Chandrababu Naidu వార్నింగ్ ?.. మాట మీద నిలబడతారా ?

    ఒకవేళ రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఈ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగితే.. అది ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు, కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం కచ్చితంగా ఉంటుంది. రఘురామ ఎలాగూ వైసీపీ ఎంపీ కాబట్టి.. ఆయన రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం వల్ల జనసేన, టీడీపీ, బీజేపీలకు కలిగే రాజకీయ నష్టం ఏమీ ఉండదు. అయితే ఆయన ఒకవేళ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడితే మాత్రం.. అది అమరావతి నినాదంతో పాటు మూడు పార్టీల కలయికపై కూడా కూడా ప్రభావం చూపుతుందనే లెక్కలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు