• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • WILL TELUGU STATES MIGHT PLAY KEY ROLE IN NATIONAL POLITICS AS PRASHANTH KISHORE TARGETS BJP IN NEXT ELECTIONS FULL DETAILS HERE PRN VSP

Prashanth Kishore: తెలుగు రాష్ట్రాలపై పీ.కే వ్యూహమేంటి..! జగన్ అందుకు అంగీకరిస్తారా..?

సీఎం జగన్ తో ప్రశాంత్ కిషోర్ (ఫైల్)

బీజేపీని (BJP) గద్దెదించేందుకు కంకణం కట్టుకున్న ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కు దక్షిణాదిలో కమలాన్ని అడ్డుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు కీలకం…

 • Share this:
  ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  రాజకీయాల్లో జెయింట్ కిల్లర్లు, కింగ్ మేకర్లు ఉంటారని గతంలో చూశాం. రాజకీయ పార్టీల భవిష్యత్తుని, నేతల తలరాతల్ని మార్చేసే వ్యక్తుల గురించి విన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తిని నేరుగా ఆధునిక భారతం చూస్తోంది. ఆయనే ప్రశాంత్ కిషోర్. దేశవ్యాప్తంగా రాజకీయాలకి ఈ పేరు సుపరిచితం. P.K అని షార్ట్ కట్ లో పిలుస్తారు. ఆయన ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన వ్యూహాంతో టాలెంట్ చూపిస్తున్నారు. ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తున్నారు. మొన్నటి వరకూ ప్రాంతీయ పార్టీల్ని కింద స్థాయి నుంచీ అందలం ఎక్కిస్తున్న పీకె ఇప్పుడు ఏకంగా బీజేపీ పైనే ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటిస్తున్నారు. ఉత్తరాధిలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా ఉన్నా.. దక్షిణాదిలో ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా  తెలుగు రాష్ట్రాల్లో పీ.కే అనుసరించే వ్యూాహాలకు  అటు కేసీఆర్, ఇటు వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది.

  పలు ఎన్నికలు..!
  ప్రశాంత్ కిషోర్ ఏదైనా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి పని చేస్తున్నారంటే ఆయా పార్టీల ప్రత్యర్థులకి ఇబ్బందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయనేంటో ప్రత్యర్థులకు తెలిసింది. రెండేళ్ల కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద విజయాన్ని సాధించింది. దీని వెనక P.K టీమ్ ఉన్నారు. ఆయన వ్యూహాలు.. జగన్ కష్టం ఇక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. గతంలో ఢిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్ విజయంలో కీలక పాత్ర పోషించింది కూడా ప్రశాంత్ కిషోర్ అండ్ కో నే. మొన్నటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహమే పనిచేసింది. ఆయా పార్టీల సీఎంలకు అఖండమైన మెజార్టీని తెచ్చిపెట్టింది. P.K అంటేనే ముచ్చెమటలు పట్టేలా చేసింది. సాక్షాత్తూ బీజేపీకి చుక్కలు చూపించారు. బెంగాల్ లో రాజకీయ ప్రత్యర్థులైన మోదీ ద్వయానికి ఎన్నిక తర్వాత భయం పట్టుకునేలా చేశారు.

  ఇది చదవండి: టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగిస్తారా..? సీఎం జగన్ మనసులో ఏముంది..?


  బీజేపీ పై..!
  బెంగాల్ ఎన్నిక తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పక్కకు తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ప్రకటించారు. అనంతర పరిణామాలు.. కొన్ని రాజకీయ శక్తుల నుంచీ వచ్చిన విన్నపమో గానీ.. ఆయన బీజేపి యేతర పార్టీలతో ముందుకెళ్లే ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకి ఊతమిచ్చి ఇప్పుడు బీజేపీపై ప్రచ్ఛన్న యుద్దమే ప్రకటించినట్టు సమాచారం. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించకపోయినా.. లోలోపల ఈ టార్గెట్ తోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల పరంగా ఒక ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీయేతర శక్తుల్ని కూడగట్టి ఆయన బలమైన మరో శక్తిని దేశంలో నిలపగలరా అన్నది పెద్ద సవాల్ గా ఉంది. దేశ రాజకీయాల్లో ఇప్పటికే బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం కొన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఆ వర్గాలకు ఒక ఆశాదీపం వెలిగేలా ఆయన ఒక రాజకీయ శక్తిని తయారు చేయగలరా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

  ఇది చదవండి: సీఎం జగన్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు... కారణం ఇదే..!


  తెలుగు రాష్ట్రాలు..
  తెలంగాణ, ఆంధ్ర. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిణితి ఉన్న రాష్ట్రాల్లో అవిభాజ్య ఏపీది ప్రముఖ స్థానం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా.. ఎంపీల బలం, రాజకీయ దిగ్గజాలు ఉన్న రాష్ట్రాలుగా ఈ రెండూ ముందంజలోనే ఉన్నాయ. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ఎటూ బీజేపీకి పక్కలో బల్లెమే. ఇక కర్నాటక బీజేపీకి చేతిలో ఉన్న అస్త్రం. తమిళనాడు కొరుకుడు పడని అంశం. ఇక తేలేది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే. ఇవి బీజేపికి సపోర్ట్ గా ఉంటాయా..? లేక పీకే టీం అమ్ములపొదిలో అస్త్రాలుగా మారుతాయా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ చూస్తే.. సీఎం కేసీఆర్ తటస్థ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నేరుగా బీజేపీతో ఢీకి దిగిన సంకేతాలేవీ లేవు. అయితే గత రాజకీయ పరిణామాల్ని అంచనా వేస్తే.. ఆయన థర్డ్ ఫ్రంట్ వైపు వేసిన అడుగులు గమనిస్తే.. ఆయన బీజేపీయేతర శక్తిగా ఉపయోగపడతారన్నది సందేమం లేని అంశం. ఇక ఇదే జరిగితే పీకె లాంటి వ్యూహకర్తకు మరో అతిపెద్ద రాజకీయ వ్యూహకర్త తోడైనట్టే.

  జగన్ ఎటు..?
  ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డి బీజేపీ వంటి రాజకీయ శక్తిని ఎదిరిస్తారనుకోవడం సందేహమే. ఏపీలో జరిగే సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ కచ్చితమైన అవసరం. రేపటి సంక్షేమం సజావుగా సాగాలంటే ఇచ్చే ఏ పథకం ఆగడానికి లేదు. ఏపీలో గద్దెనెక్కిన నాటి నుంచీ జగన్ సంక్షేమ మంత్రాన్ని జపిస్తున్నారు. దీనికి ప్రజలు కూడా అలవాటుపడినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్క పథకం ఆపినా.. ఇప్పుడు నెగటివ్ అవుతుంది. అందుకే ఆయన కేంద్రంతో విభేదాలు పెట్టుకునే పని ఏ మాత్రం చేయబోరన్నది కీలకమైన చర్చ. అలాగే ఆయన ఎన్డీఏ కూటమిలో కూడా చేరతారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. మూడు కేంద్ర మంత్రి పదవులు.. అలయెన్స్ లో పొందాల్సిన లబ్ధి మీదనే ప్రస్తుతానికి సీఎం దృష్టి కేంద్రీకరించారని తెలుస్తోంది. ఇది కాక.. ఆయన పై ప్రత్యర్ధులు సీబీఐ కేసుల అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ అంశం తీవ్రంగా పరిశీలించినా.. జగన్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లరనేది సమాచారం.

  పీ.కే ఒప్పిస్తే.?
  ప్రశాంత్ కిషోర్, జగన్ మోహన్ రెడ్డి ఇప్పట్లో ఈ అంశం పై ప్రస్తావిస్తారంటే అది అతిశయోక్తే అవుతుంది. P.K ఇప్పటికైతే దక్షిణాది రాష్ట్రాల్ని ఈ క్షేత్రంలోకి దింపుతారన్నది చెప్పలేం. మొన్న జరిగిన కేరళ, తమిళనాడు ఎన్నికలు.. ఆ పై తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రంతో ఉన్న అవసరాలు దరిమిలా.. ఏ ఒక్కటీ ఆయన వ్యూహాలకు సానుకూలాంశాలుగా లేవు. ఒకవేళ ఈ కదనరంగంలోకి దింపాలంటే మరో ఏడాది ఎటూ సమయం కూడా పడుతుంది. అందుకే వీరికి ఇప్పట్లో ఆదేశాలు ఉండబోవు. ఇప్పటికే శరద్ పవార్ ఇంటిలో జరిగే సమావేశానికి వైసీపీ పార్టీ నేతలు వెళ్లలేదు. వైసీపీ ఎంపీకి ఈ సమావేవానికి కబురు వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్డీయే కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇక బీజేపీ కూడా తన శక్తుల్ని మొత్తం వినియోగిస్తుందనడంలో సందేహం లేదు.
  Published by:Purna Chandra
  First published: