ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా... గవర్నర్‌ను రంగంలోకి దింపుతుందా?

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్మికల సంఘాల నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 9, 2019, 1:24 PM IST
ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా... గవర్నర్‌ను రంగంలోకి దింపుతుందా?
గవర్నర్ తమిళిసై, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు కార్మిక సంఘాల నాయకులు అఖిలపక్షం నేతలతో సమావేశం కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై యాక్షన్ ప్లాన్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో... సర్కార్‌పై పోరాటం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్మికల సంఘాల నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ వైపు ఇప్పటికే ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి కార్మిక సంఘాల నేతలు కొందరు అఖిలపక్షం నేతలతోనూ చర్చిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ అంశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని వివరణ కోరే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ద్వారా కేంద్రం ఆరా తీసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఈ అంశంపై గవర్నర్ ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com