కేసీఆర్ సరికొత్త వ్యూహాలు...తెలంగాణలో తిరుగులేదు... కేంద్రంలో కీలకమవుతారా ?

Lok sabha election results 2019 | తెలంగాణలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కేసీఆర్... కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దక్కినా... జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించేందుకు ఆయన వ్యూహలు సిద్ధం చేసుకున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 7:27 AM IST
కేసీఆర్ సరికొత్త వ్యూహాలు...తెలంగాణలో తిరుగులేదు... కేంద్రంలో కీలకమవుతారా ?
కేేసీఆర్ (File)
  • Share this:
టీఆర్ఎస్ వ్యూహాల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలకమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేధావులు, ఉన్నతాధికారులు, నమ్మకస్తులైన నాయకులు ఇలా అనేక మంది సలహాలు తీసుకుని కేసీఆర్ తన వ్యూహాలను పదునుపెడుతుంటారు. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు తిరుగులేని వ్యూహాలను రచించడంలో కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ముందుంటారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు వంటి డైనమిక్ లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్... అంతకుముందు మంత్రిగా అనేక విజయాలు సాధించారనే చెప్పారు.

ఐటీ మంత్రిగా తనదైన మార్క్ చూపించడంలో కేటీఆర్ బాగా సక్సెస్ అయ్యారు. టీఎస్ ఐపాస్ వంటి అంశాలు కేటీఆర్ ఇమేజ్‌ను బాగా పెంచాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడంలో హరీశ్‌రావు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి వ్యవహరించిన హరీశ్ రావు... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగడంలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు సమయం వచ్చినప్పుడు రంగంలో దిగి పనులు చక్కదిద్దేందుకు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వాళ్లు ఉండనే ఉన్నారు.

కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో నమ్మకం కలగడానికి సాగునీరు, విద్యుత్, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన కారణాలు. 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం తరువాత కేసీఆర్ తన సారథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పరిపాలనలో మాజీ ఐఏఎస్ అధికారి గోయల్, సాగునీటి రంగం నిపుణుడు విద్యాసాగర్ రావు వంటి వారి సలహాలను ఆయన బాగా తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలకు అనుగుణంగా కేసీఆర్ టీఆర్ఎస్‌ను తెలంగాణవ్యాప్తంగా విస్తరించారు. ఇవన్నీ తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రజాదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

ఏడాదికి రూ. 8000 ఇచ్చే రైతుబంధు పథకం రైతుల్లో కేసీఆర్ ప్రభుత్వం పట్ల సానుకూలత పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి. ఇక పెన్షన్ల వంటి అంశాలు టీఆర్ఎస్‌కు పేదవర్గాలను మరింత దగ్గరచేశాయి. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఎంతగానో కృషి చేసింది. రైతులకు సైతం 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన క్రెడిట్ కేసీఆర్ సొంతం చేసుకున్నారు. వేగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావించిన కేసీఆర్ లక్ష్యం వేగంగా నెరవేరుతోంది. ఇందుకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తెలంగాణలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కేసీఆర్... కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దక్కినా... జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించేందుకు ఆయన వ్యూహలు సిద్ధం చేసుకున్నారు.
First published: May 23, 2019, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading