Home /News /politics /

WILL TELANGANA CM KCR NEW STRATEGY WILL HAVE MORE IMPACT ON CONGRESS PARTY THAN BJP HERE IS THE DETAILS AK

KCR-Congress: కేసీఆర్ కొత్త ప్రయత్నాలు.. కాంగ్రెస్‌లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..?

కేసీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana News: సీఎం కేసీఆర్ ఈ క్రమంలో వేస్తున్న వ్యూహాలు, ఎత్తుగడల కారణంగా అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనేనా అనే చర్చ కూడా సాగుతోంది.

    రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరూ ఊహించలేరు. అందుకే తాము అనుకున్నది జరగాలని కోరుకోవడం కాకుండా.. జరిగిన దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడంపైనే రాజకీయ నేతలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే ఇందులో కొంతమంది నాయకులు మాత్రమే ఎక్కువగా విజయం సాధిస్తుంటారు. ఎలాంటి పరిణామాలనైనా తనకు అనుకూలంగా మార్చుకునే నేతల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుంటారనే విషయం చాలాసార్లు రుజువైంది. తన పొలిటికల్ కెరీర్‌లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న క్రమంలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఒకప్పుడు బీజేపీని అంత సీరియస్‌గా తీసుకోని కేసీఆర్.. ఇప్పుడు కాషాయ పార్టీ లక్ష్యంగానే వ్యూహాలు రచిస్తున్నారు.

    అయితే సీఎం కేసీఆర్ ఈ క్రమంలో వేస్తున్న వ్యూహాలు, ఎత్తుగడల కారణంగా అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనేనా అనే చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కేసీఆర్ కూడా దేశవ్యాప్తంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో వామపక్షాలు, ఆర్జేడీ సహా పలు పార్టీల నేతలో సమావేశం నిర్వహించారు. కేసీఆర్ సమావేశాల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా ఓ క్లారిటీ రాకపోయినప్పటికీ.. కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాల ప్రభావం తమ పార్టీ మీద పడుతుందేమో అనే భయం కాంగ్రెస్ నేతల్లో నెలకొందని ఊహాగానాలు మొదలయ్యాయి.

    బీజేపీ వ్యతిరేక పార్టీల జాబితాలో కాంగ్రెస్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లో.. బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహించే అవకాశాలు పెద్దగా లేవనే చర్చ జరుగుతోంది. కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌కు ఆ సత్తా లేదనే భావనలో ఉన్నాయి. ఒకవేళ ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. అందులో ఒక పార్టీగా మాత్రమే దాన్ని చూడాలనే యోచనలో పలు ఇతర పార్టీలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    Telangana: కేసీఆర్ అలాంటి పరిస్థితి తీసుకొస్తారా ?.. అదే అజెండాతో ముందుకు వెళతారా ?

    KCR-Chandrababu: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్.. సీన్ రిపీట్ అవుతోందా ?

    ఒకవేళ అదే జరిగి టీఆర్ఎస్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో పని చేయాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటనే టెన్షన్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలైందని సమాచారం. ఒకసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో మొదలైతే.. అది అంతిమంగా టీఆర్ఎస్‌కే లాభం కలిగిస్తుందని.. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడటం మాట అటుంచి మరింత నష్టపోవాల్సి ఉంటుందనే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో మొదలైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు