K Chandrashekar Rao: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా ?.. లేదా ?

'సీఎం కేసిఆర్ (ప్రతీకాత్మక చిత్రం )

Huzurabad: సాగర్ తరహాలోనే హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలకు ముందు దళితబంధు పథకం ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం రెండోసారి హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉండాలని టీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మరీ ముఖ్యంగా గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్న టీఆర్ఎస్, బీజేపీలు.. విజయం కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. బీజేపీ తరపున కొందరు నేతలు ప్రచారం చేస్తున్నా.. నియోజకవర్గంలో తన సొంత ఇమేజ్‌పైనే ఎక్కువగా ఆశలుపెట్టుకున్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. అందుకే నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి వారిని ఓటు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్‌లో ప్రచార బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు.. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అధినేత కేసీఆర్‌కు సమాచారం అందిస్తున్నారు.

    అయితే ఈ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారం సభ ఉంటుందా ? లేదా ? అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. తాను హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ సభ ఉంటుందా లేదా అన్నది చెప్పలేనని మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించారు. కరోనా నిబంధనల కారణంగా హుజూరాబాద్‌లో కేవలం వెయ్యిమందితో మాత్రమే సభలు, సమావేశాలు పెట్టుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.

    దీంతో కేసీఆర్ సభ అంటే కచ్చితంగా హుజూరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో అక్కడ సీఎం కేసీఆర్ సభ ఉంటుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ సభపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. నాగార్జునసాగర్‌లో రెండుసార్లు సీఎం కేసీఆర్ పెట్టడం వల్లే అక్కడ పార్టీకి మైలేజీ వచ్చిందని.. దుబ్బాకలోనూ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ జరుగుతోంది.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    సాగర్ తరహాలోనే హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలకు ముందు దళితబంధు పథకం ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం రెండోసారి హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉండాలని టీఆర్ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉన్న తరుణంలో సీఎం కేసీఆర్ సభ పార్టీకి ఎంతో కొంత కలిసి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా లేక మరో రూపంలో హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరతారా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: