Home /News /politics /

WILL TELANGANA CM KCR HAS TO FACE SOME PROBLEMS WITH MLAS WHO CAME FROM CONGRESS HERE IS THE REASON AK

Telangana Politics: కేసీఆర్‌కు ఈసారి ఆ ఎమ్మెల్యేలతో అలాంటి తలనొప్పులు తప్పవా ?

కేసీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్న కేసీఆర్‌కు సైతం సొంత పార్టీలో పలు చిక్కులు తప్పకపోవచ్చనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీనిపై కొద్ది నెలల క్రితం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినా.. మరోసారి గులాబీ బాస్ ముందస్తు ప్లాన్ వేస్తున్నారనే వార్తలకు మాత్రం చెక్ పడటం లేదు. మరోవైపు అటు తెలంగాణలోని విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంపై కూడా కాంగ్రెస్, బీజేపీలు ఫోకస్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. గతంలో కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా తాము వ్యూహాత్మకంగా దెబ్బతిన్నామనే భావనలో విపక్షాలు ఉన్నాయి. ఎన్నికలకు తాము సిద్ధంకాకముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారనే భావనలో ఉన్న విపక్షాలు.. ఈసారి మాత్రం అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాయి.

    అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్న కేసీఆర్‌కు సైతం సొంత పార్టీలో పలు చిక్కులు తప్పకపోవచ్చనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ టికెట్ ఇస్తారా ? ఒకవేళ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీలో ఉన్నవాళ్లు ఏ రకంగా ముందుకు వెళతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఇలా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో ఎంతమందికి మళ్లీ టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు.. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అనడం టీఆర్ఎస్‌కు మింగుడుపడటం లేదు.

    K ChandraShekar Rao: అప్పటివరకు మౌనమే.. సీఎం కేసీఆర్ అలా డిసైడయ్యారా ?

    Telangana Politics: రేవంత్ రెడ్డికి ఇప్పట్లో అలాంటి తలనొప్పులు లేనట్టేనా ?.. ఇదే మంచి అవకాశమా ?

    వారికి నచ్చజెప్పకుండా వీరికి టికెట్లు ఇస్తే.. మొదటికే మోసం వస్తుందా అనే టెన్షన్ కూడా గులాబీదళంలో ఉందనే చర్చ జరుగుతోంది. అయితే గతంలో పార్టీ మారి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారిలో మెజార్టీ నేతలకు టీఆర్ఎస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా లేక కేసీఆర్ భిన్నంగా ఆలోచిస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు