తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేల ద్వారా వివిధ అంశాలపై రిపోర్టులు తెప్పించుకోవడంలో మిగతా వారికంటే కాస్త ముందుంటారు. ఎన్నికలకు ముందు ప్రజల మూడ్ ఎలా ఉంది ? ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏం చేయాలనే దానిపై కూడా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్వహించే సర్వేలపై ఆధారపడుతుంటారనే టాక్ ఉంది. గతంలోనే వివిధ రాష్ట్రాల్లో ఎవరు విజయం సాధిస్తారనే తన అంచనాలను మీడియాతో పంచుకున్నారు గులాబీ బాస్. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయని కేసీఆర్ భావిస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందనే విషయం అందరికీ తెలిసిందే.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇప్పుడు బీజేపీ లక్ష్యంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఆ పార్టీని టార్గెట్ చేస్తూనే ప్రకటనలు, విమర్శలు చేస్తున్నారు. మరికాసేపట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన తన స్పందన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఓ పనికిమాలిన బడ్జెట్‌గా అభివర్ణించిన టీఆర్ఎస్ అధినేత.. బడ్జెట్‌ను వివరిస్తూ కేంద్రంపై మరింతగా విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ? ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి తన అంచనాలు ఏమిటనే దానిపై కేసీఆర్ ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రం, బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అందులోనూ కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు.
Also Read: K Chandrashekar Rao: కేసీఆర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా ? ఆ విషయంలో రిస్క్ తీసుకోలేదా ?
Also Read: Telangana Politics: రేవంత్ రెడ్డితో ఆ కీలక నేతకు దూరంగా పెరిగిందా ?.. అదే కారణమా ?
పరిస్థితులు అనుకూలిస్తే.. అక్కడికి వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి కూడా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ సిద్ధంగానే ఉన్నారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సహా వివిధ అంశాలపై బీజేపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై స్పందిస్తారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.