కోడెల మళ్లీ గెలుస్తారా ? 2014లో ఏం జరిగింది ?

కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)

సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు ఈసారి విజయం సాధిస్తారా లేదా అనే అంశంపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. టీడీపీ, వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో... కోడెలపై దాడి వ్యవహారం సత్తెనపల్లిలో గెలుపు ఓటములపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Share this:
    ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇవన్నీ ఎలా ఉన్నా... టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. కోడెలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారని టీడీపీ... ఆయనే డ్రామాలు ఆడారని వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కోడెలపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. దీన్ని నిరసిస్తూ వైసీపీ ముఖ్యనేతలు గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. కోడెలపై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.

    ఈ మొత్తం వ్యవహారం సంగతి ఇలా ఉంటే... సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు ఈసారి విజయం సాధిస్తారా లేదా అనే అంశంపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. సత్తెనపల్లి సీటు కోడెలకు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అంత సముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ... పట్టుబట్టి మరీ మరోసారి సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగారు కోడెల. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్లు మెజారిటీతో విజయం సాధించిన కోడెల శివప్రసాదరావు... ఈసారి గెలుపు కోసం తీవ్రంగానే శ్రమించారని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయిష్టంగానే సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించిన కోడెల... ఈసారి ఏరికోరి మళ్లీ ఈ సీటు నుంచి బరిలోకి దిగారు. టీడీపీ, వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో... కోడెలపై దాడి వ్యవహారం సత్తెనపల్లిలో గెలుపు ఓటములపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
    First published: